‘వాల్తేరు వీరయ్య’ లాంటి బంపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ టీజర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. మన అందరికీ ముందే తెలుసు, ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ వేదలమ్ చిత్రానికి రీమేక్ అని.

అప్పట్లో ఈ సినిమా తమిళ సినిమా ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది. అజిత్ ఈ చిత్రం లో తన నట విశ్వరూపాన్ని చూపించాడని చెప్పాలి. కేవలం ఆయన నటన వల్లే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సినిమాని రీమేక్ చెయ్యాలి అనుకోవడం పెద్ద సాహసమే.

అందులోనూ ఫ్లాప్ తప్ప హిట్టు స్పెల్లింగ్ కూడా తెలియని మెహర్ రమేష్ ఈ చిత్రానికి డైరెక్టర్ అనడం తో అభిమానుల్లో అంచనాలే లేవు. కానీ ఈ టీజర్ ని చూసిన తర్వాత అంచనాలు అమాంతం పెరిగిపోతాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీమేక్ అయ్యినప్పటికీ చిరంజీవి స్టైల్ లో ఉండేట్టు మార్పులు చేర్పులు చేసినట్టుగా ఈ టీజర్ ని చూసినప్పుడే అభిమానులకు అర్థం అయిపోయింది. ఇక తెలంగాణ స్లాంగ్ లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్స్ కి అదిరిపోయే రేంజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

‘నేను షికారు కి వెళ్లిన షేర్ బే’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అంతే కాకుండా టీజర్ చివర్లో ఆయన ‘ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్ళే.. అన్ని ఏరియాలు నావే, చూసుకుందాం ఆగష్టు 11న’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కి పండుగ చేసుకునేలా ఉంది. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా అనిపిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.