Bharateeyudu 2 : కోట్లాది మంది అభిమానులు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న భారతీయుడు 2 చిత్రం రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘భారతీయుడు’ వంటి ఆల్ టైం క్లాసికల్ ఇండస్ట్రీ హిట్ కి సంబంధించిన సీక్వెల్ కావడంతో ఈ సినిమా మీద అంచనాలు తార స్థాయిలో ఉండేవి. కానీ మధ్యలో అనేకసార్లు షూటింగ్స్ వాయిదా పడుతూ రావడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ శంకర్ మీద ఉన్న నమ్మకంతో, ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మి భారీ బిజినెస్ చేసారు బయ్యర్స్. టాక్ నెగటివ్ గా వచ్చినప్పటికీ మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ దక్కింది. అన్నీ భాషలకు కలిపి ఈ చిత్రం మొదటి రోజు దాదాపుగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందట.
అలాగే రెండవ రోజు కూడా దాదాపుగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి, శంకర్ కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజి ఎలాంటిదో ట్రేడ్ కి మరోసారి రుజువు చేసింది. మూడవ రోజు తమిళనాడు ప్రాంతంలో మొదటిరోజుతో సమానంగా వసూళ్లను రాబట్టిందట. ఇక రేపటి నుండి వర్కింగ్ డేస్ అవ్వడం, టాక్ కూడా బాలేకపోవడం తో వసూళ్లు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ గా మిగలనుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. టాక్ వచ్చి సినిమాకి మంచి రన్ ఉండుంటే ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ఓటీటీ లో విడుదల చేసేవారు.
కానీ డిజాస్టర్ టాక్ రావడంతో ఆగష్టు 15 వ తారీఖున స్వతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా సినిమాలు థియేటర్స్ లో విఫలం అయ్యినప్పటికీ, ఓటీటీ లో మంచి ఆధరణని దక్కించుకుంటూ ఉంటాయి. ఈ ఏడాది విడుదలైన గుంటూరు కారం చిత్రం అందుకు నిదర్శనం. ఇప్పుడు ఇండియన్ 2 కి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.