Bharateeyudu 2 ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా నిల్చిన ఇండియన్ 2 చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందిరికీ తెలిసిందే. శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఇండియన్ 2 అంటే ఆడియన్స్ ఆ స్థాయి టేకింగ్, ఆ స్థాయి స్టోరీ టెల్లింగ్ ని ఆశించగా, కనీస స్థాయి అంచనాలను కూడా ఇండియన్ 2 చిత్రం అందుకోలేకపోయింది.

కానీ శంకర్ కి ఉన్న బ్రాండ్ ఇమేజి కారణంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ తో పాటుగా, వీకెండ్ వరకు పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి. అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదలై వారం రోజులు అవ్వగా, ఈ వారం రోజులకు గాను ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి అంచనా వేద్దాం. తెలుగు లో శంకర్ కి మంచి మార్కెట్ ఉన్న కారణంగా భారతీయుడు 2 చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సుమారు 24 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు అంచనా. అలాగే మొదటి వారం లో ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.
ఫుల్ రన్ లో 16 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. సినిమాకి ఒకవేళ హిట్ టాక్ వచ్చి ఉంటే తెలుగు రాష్ట్రాల నుండి కేవలం రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ అయ్యేదట. ఇక ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే తమిళ్ నాడు లో 43 కోట్ల రూపాయిల గ్రాస్ ,కర్ణాటకలో 8 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్, కేరళలో 5 కోట్ల 20 లక్షల రూపాయిలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 7 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 43 కోట్ల రూపాయిలు, మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయిల గ్రాస్, 62 కోట్ల రూపాయిల షేర్ మొదటి వారం లో వచ్చాయి. ఫుల్ రన్ లో మరో 20 కోట్ల రూపాయిల గ్రాస్, 10 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.