Bhagavath Kesari : భగవంత్ కేసరి టీం షాకింగ్ డెసిషన్.. నో టికెట్ ఫ్రీగా సినిమా చూసే ఛాన్స్.. కండీషన్స్ అప్లై

- Advertisement -


Bhagavath Kesari : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, టాలీవుడ్ క్రష్ శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. డే 1నుంచే భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. బాలయ్య బాబును మాస్ కా బాస్ లా చూపిస్తుంటారు డైరెక్టర్లు. కానీ ఈ సినిమాలో బాలకృష్ణను అనిల్ సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఒక మంచి మెసేజ్ తో పాటు తండ్రి – కూతుర్ల మధ్య బాండింగ్ గురించి కూడా తెలియజేయడంతో సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీసు వద్ద 33 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు అందించారు.

Bhagavath Kesari
Bhagavath Kesari

ఈ మూవీలో ఓ మంచి మెసేజ్ ఉంది. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాలని, మహిళలే కదా అని తక్కువగా చూడవద్దని వాళ్లు కూడా స్ట్రాంగ్ అని చూపించారు. ఇలాంటి డైలాగులను బాలయ్యతో చెప్పించడంతో చాలామంది చిత్ర బృందాన్ని పొగిడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో ఉన్న మంచి మెసేజ్ ను పిల్లలకు చేరవేయాలని మూవీ మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూలో చదువుకుంటున్న ఆడపిల్లలు అందరికీ ఈ మెసేజ్ తీసుకెళ్లాలని భగవంత్ కేసరి టీమ్ భావించినట్లు సమాచారం. త్వరలోనే స్కూల్ పిల్లలకు ఫ్రీగా సినిమా వేయబోతున్నట్లు అందుకు సంబంధించి చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ చిత్ర బృందాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here