మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో కలిసి పని చేసిన హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం అనే చెప్పాలి. ఎంతో మంది అలా చేసారు కానీ, కొంతమంది మాత్రమే సంసార సాగరం లో ఈదుతున్నారు. ఆ కొంతమంది లో ఒక్కరు అక్కినేని నాగార్జున. ఈయన తొలుత వెంకటేష్ సోదరి లక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.

ఇక ఆ తర్వాత తనతో కలిసి శివ సినిమాలో నటించిన ‘అమల’ ని ప్రేమించి పెళ్లాడాడు నాగార్జున. వీళ్లిద్దరి అన్యోన్య దాంపత్య జీవితం ఎంత అందంగా కొనసాగుతుందో మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరికీ అఖిల్ పుట్టాడు. ఇతనికి టాలీవుడ్ లో ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. క్రేజ్ అయితే బాగానే ఉంది కానీ, హిట్ సినిమాలే లేవు. ఇది అక్కినేని అభిమానులకు బాగా బాధని కలిగించే విషయం.

ఇదంతా పక్కన పెడితే అమల ఒకప్పుడు తమిళం లో పెద్ద స్టార్ హీరోయిన్. అప్పట్లో సూపర్ స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్న రజినీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి తో కూడా ‘రాజావిక్రమార్క’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆమె ఎన్ని సినిమాల్లో నటించిన, ఆమె కెరీర్ లో ‘ఘర్షణ’ చిత్రం ఎంతో ప్రత్యేకం.

ఈ సినిమాలో కార్తీక్ మరియు ప్రభు హీరోలుగా నటించారు. తమిళం లో పాటుగా , తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో అమల హీరో కార్తీక్ తో ప్రేమాయణం నడిపింది అని అప్పట్లో ఒక పెద్ద టాక్ నడిచింది. అయితే కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోయారని, అమల ని పెళ్లి చేసుకునేందుకు కార్తీక్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని టాక్.