Jabardasth Aadi : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా కష్టపడి నేడు ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ కమెడియన్స్ లో ఒకరిగా కొనసాగుతున్న వ్యక్తి హైపర్ ఆది. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో లో ‘అదిరే అభి’ టీం లో ఒక కంటెస్టెంట్ గా చేస్తూ వచ్చిన హైపర్ ఆది, ఆ తర్వాత అతనిలో ఉన్న టైమింగ్ మరియు కామెడీ ని చూసి మల్లెమాల ఎంటెర్టైమెంట్స్ ఆయన్ని టీం లీడర్ ని చేసింది.

టీం లీడర్ అయ్యాక హైపర్ ఆది స్కిట్స్ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈటీవీ లో హైపర్ ఆది లేకపోతే సగం ఎంటెర్టైమెంట్ షోస్ లేవు, ఆ రేంజ్ లో తయారు అయ్యాడు ఆయన. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హైపర్ ఆది ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో తనకి ఎదురైనా కొన్ని సంఘటనలను చెప్పుకొచ్చాడు.

ఆయనకీ పదవ తరగతి లో 545 మార్కులు, ఇంటర్ లో 950 మార్కులు మరియు బీటెక్ లో 85 శాతం మార్కులు వచ్చాయట. ఈ సర్టిఫికేట్లు ని పట్టుకొని ఆయన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు దగ్గరకి వెళ్తాడట. ఇవన్నీ చూపించి తనకి సినిమాల్లో అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరాడట. ఈ రేంజ్ మార్కులు పెట్టుకొని సినిమాల్లో పని చెయ్యడం ఏమిటిరా, వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకో అన్నాడట దాసరి.

ఆ తర్వాత కొన్నాళ్ళకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నడుపుతున్న జబర్దస్త్ షో లో పాల్గొనే అవకాశం వచ్చిందట. ఈ షోలో పని చేస్తున్నప్పుడు హైపర్ ఆదికి గవర్మెంట్ లో పని చేస్తున్న అనుభూతి కలిగిందట. తన స్కిట్స్ కి వచ్చిన వ్యూస్ కి తగ్గట్టుగానే పేమెంట్ తీసుకుంటాడట. పేమెంట్ విషయం లో ఎప్పుడూ కూడా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఆలస్యం చెయ్యలేదని. ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పేమెంట్ అందేవని, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అనుభూతి కలిగింది అంటూ హైపర్ ఆది కామెంట్స్ చేసాడు.