Actress Aishwarya : ఫిదా సినిమాలో సాయిపల్లవి డైలాగ్ గుర్తుందా.. గట్టిగా అనేసుకో అవుతుందిలే అని.. అలాగే మనకేదైనా దక్కాలంటే గట్టిగా అనుకుంటే సరిపోతుంది. మనకు చేరాలని ఉంటే ఎంతమంది ఎలాంటి పనులు చేసినా అది మన దగ్గరికి వచ్చి చేరుతుంది. కానీ కొన్నిసార్లు మనం అనుకున్న కూడా కొన్ని పనులు చేయలేక పోతాము. దాని వల్ల జీవితంలో చాలా కోల్పోతుంటాం. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందువల్ల అది కోల్పోయామో తెలిస్తే చాలా బాధేస్తుంది. అలాంటి ఒక సంక్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది నటి ఐశ్వర్య.
ఆమె తన తల్లి తీసిన సినిమాతోనే వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. అలా హీరోయిన్ గా సెటిల్ అవ్వాల్సిన ఐశ్వర్య.. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు. ఎంతో పట్టుదలతో ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా సెటిల్ అవ్వాల్సిన ఐశ్వర్య అనేక కారణాల చేత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది. తాను ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కి సంబంధించిన కొన్ని కీలక విషయాలు పంచుకుంది ఐశ్వర్య.. ‘ నేను మణిరత్నం గారి సినిమాలో చాలా సార్లు హీరోయిన్‌గా ఎంపిక అయాను. కానీ చేయలేక పోయాను . మీకు ‘రోజా’ సినిమా గుర్తుండే ఉంటుంది.
ఇందులో మధుబాల పాత్ర కోసం తొలుత నన్నే సంప్రదించారు. కానీ ఆ సమయంలో తెలుగులో మరో చిత్రం కోసం అడ్వాన్స్ తీసుకున్నాను. అలా డేట్స్ విషయంలో సమస్య వస్తుందని.. మా అమ్మమ్మ చెయ్యడం కుదరదు అని చెప్పారు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత రోజా స్థానంలో నేను లేనందుకు చాలా బాధపడ్డాను. ఎంతలా అంటే సినిమా థియేటర్ నుంచి ఇంటికి వెళ్లి అక్కడే ఉన్న నా చెప్పుతో.. నన్ను నేనే కొట్టుకున్నా. అంత మంచి పాత్రను పోయేలా చేసినందుకు అమ్మమ్మని చంపేద్దామనెంత కోపం కూడా వచ్చింది.
దీం తర్వాత ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలో హీరోయిన్ గౌతమి పాత్ర కోసం కూడా మణిరత్నం ముందు నన్నే సంప్రదించారు. ఆ సమయంలో కూడా డేట్స్ సమస్య వచ్చి చేయలేకపోయా. ఇక అన్నిటి కన్నా ముందు ‘దళపతి’ సినిమాలో శోభన పాత్రలో కూడా నటించాల్సి ఉంది. అప్పుడు కూడా డేట్స్ సమస్య వచ్చి ఆ సినిమా నుంచి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంత మంచి కథలు పాత్రలు మిస్ చేసుకున్నందుకు ఇప్పటికి బాధ పడుతున్నాను’ అంటూ తెలిపింది. మణిరత్నం సినిమాలో చిన్న పాత్ర చేసిన చాలు అనుకునే నటులు చాలా మంది ఉంటారు. కానీ ఇలా తన మూవీలో ఏకంగా హీరోయిన్ పాత్రలనే కాలాదనుకుంన్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతుందట ఐశ్వర్య.