తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కమెడియన్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. అన్నిటికన్నా ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.. ఇది ఇలా ఉండగా బండ్ల, త్రివిక్రమ్ ల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే..గత కొంత కాలం నుండి ట్విట్టర్ లో బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై మరియు పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైర్లు వేస్తూ కనిపించడం మనం గమనిస్తూనే ఉన్నాము.. అంతేకాదు త్రివిక్రమ్ వల్లే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు విడిపోయారని పరోక్షంగా హింట్ ఇచ్చాడు.. ఈ వార్త ఇప్పుడు సంచలంగా మారింది..

ఇకపోతే ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బండ్ల గణేష్ కి ఉద్దేశపూర్వకంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆహ్వానం పంపలేదు. అప్పటి నుండి బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై తిరగబడ్డాడు.ఆయనని నమ్మి తనని పవన్ కళ్యాణ్ దూరం చేసాడు అనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ గురించి అప్పుడప్పుడు పరోక్ష సెటైర్లు కూడా వేస్తుంటాడు బండ్ల గణేష్. ఆయన చేసే కామెంట్స్ పెద్ద వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ భజన తో ట్విట్టర్ మొత్తం మారుమోగిపోయ్యేలా చేసిన బండ్ల గణేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఊసే ఎత్తడం లేదు. ‘గబ్బర్ సింగ్’ చిత్రం వార్షికోత్సవం కి ఆయన నుండి ఒక్క ట్వీట్ కూడా రాకపోవడం అందరిని ఆలోచనలో పడవేసింది..

మొన్నటివరకు సామి అంటూ భజన చేసిన బండ్ల ఇప్పుడు గబ్బర్ సింగ్ విడుదల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యాన్స్ మొత్తం సంబరాలు చేసుకుంటుంటే నాకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా బండ్ల గణేష్ వ్యవహరించిన తీరు చూస్తుంటే ఈయన కూడా పవన్ కళ్యాణ్ కి త్వరలోనే వెన్నుపోటు పొడవబోతున్నారా అనే సందేహం అభిమానుల్లో మొదలైంది..
కాగా, ఒక అభిమాని బండ్ల గణేష్ ని ట్యాగ్ చేస్తూ ‘అన్నయ్య నిర్మాత అవ్వాలంటే ఎలా’ అని అడుగుతాడు. అప్పుడు బండ్ల గణేష్ ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ‘గురూజీ (త్రివిక్రమ్) కి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వు.. కచ్చితంగా అవకాశం ఇస్తాడు’ అని అంటాడు.. అలాగే..భార్యాభర్తల్ని,తండ్రి కొడుకుల్ని,గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు.. అది మన గురూజీ స్పెషాలిటీ’ అంటూ రిప్లై ఇస్తాడు. భార్య భర్తల్ని వేరు చెయ్యడం అంటే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ని ఉద్దేశించి మాట్లాడాడని అర్థం అవుతుంది అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. మరి ఈ వ్యాఖ్యలపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి..