సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చి, ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో సరికొత్త జానర్ సినిమాలను తీసి, సంచలన విజయాలను అందుకొని సూపర్ స్టార్ గా ఎదిగాడు కృష్ణ. ఆయన కుటుంబం నుండి ఇది వరకు ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చారు,కానీ తండ్రి లాగ సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నది ఒక్క మహేష్ బాబు మాత్రమే.
మహేష్ బాబు కంటే ముందే ఆయన సోదరుడు రమేష్ బాబు ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యినప్పటికీ, ఆ తర్వాత నుండి మాత్రం సరైన హిట్ పడకపోవడం తో కెరీర్ ని కొనసాగించలేకపొయ్యారు.ఇక మహేష్ బాబు సోదరి మంజుల కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది, ఈమెకి హీరోయిన్ గా చెయ్యాలని ఆసక్తి మొదటి నుండి ఉండేదట.
ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ దర్శకుడు SV కృష్ణరెడ్డి తనకి కృష్ణ గారితో ఉన్న చనువు కొద్దీ మా చిత్రం లో మీ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవచ్చా అని అడిగాడట. మా అమ్మాయికి మరియు మీ హీరో కి నచ్చితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కృష్ణ చెప్పాడట. ఇంతకీ మంజుల ని హీరోయిన్ గా తీసుకోవాలన్నది ఎవరి సినిమాకో కాదు, నందమూరి బాలకృష్ణ ని పెట్టి అప్పట్లో ఆయన టాప్ హీరో అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మంజుల ని తీసుకునే ప్రయత్నం చేసాడు.
అయితే బాలయ్య మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోలేదట. అమ్మాయి చాలా చిన్నపిల్లలాగా ఉంది, హీరోయిన్ మెటీరియల్ కూడా కాదు, వద్దు మన సినిమాకి అని అన్నాడట, ఈ విషయాన్ని స్వయంగా మంజుల ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. అలా ఈ విషయం చర్చల దశలో ఉన్నప్పుడే మీడియా కి సమాచారం అందింది. కృష్ణ ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసారు, మేము కృష్ణ గారి అమ్మాయిని మా కుటుంబ సభ్యురాలిగా అనుకున్నాము, అలాంటి అమ్మాయిని హీరోయిన్ గా తీసుకొస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు అంటూ అప్పట్లో ‘టాప్ హీరో’ మూవీ కటౌట్స్ ని తగలపెట్టారట.కృష్ణ అంటే అంత అభిమానం ఉండేది ఫ్యాన్స్ కి ఆ రోజుల్లో.