ఆ హీరోయిన్ పై మనసుపడ్డ బాలయ్య.. ఏకంగా BMW కార్ కొనిచ్చేసాడు!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ చిలిపితనం గురించి మన తెలియనిది ఏముంది, ఆయనలోని గాంభీర్యాన్ని చూసాము , ఆయనలోని చిలిపి యాంగిల్ ని కూడా చూసాము. ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అనడానికి ప్రతిరూపమే బాలయ్య బాబు. ఆయన సెట్స్ ఉన్నంత సేపు చాలా ఎనర్జీ ఉంటుంది, ప్రతీ ఒక్కరితో ఎంతో సరదాగా గడుపుతూ ఉంటాడు బాలయ్య. ముఖ్యంగా హీరోయిన్స్ తో పులిహోర కలపడం లో బాలయ్య బాబు నేర్పరి.

బాలకృష్ణ
బాలకృష్ణ

అలా ఆయన ఒక హీరోయిన్ తో చాలా సరదాగా ఉండేవాడట, ఆమె తో ఫ్రెండ్లీ గా చాలా బాగా కనెక్ట్ అయ్యాడట.ఆ హీరోయిన్ మరెవరో కాదు, తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన ‘అంజలి’. వీళ్లిద్దరు కలిసి గతం లో ‘డిక్టేటర్’ అనే సినిమా లో నటించారు. ఈ మూవీ 2015 వ సంవత్సరం, సంక్రాంతి కానుకగా విడుదలై యావరేజి ఫలితాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో బాలయ్య బాబు అంజలి కి చాలా క్లోజ్ అయ్యాడట. అలా ఆయన మనసుకి బాగా దగ్గరైన వ్యక్తిగా అంజలి మారిపోవడం తో, ఆమె పుట్టినరోజు నాడు BMW కార్ ని గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసాడట. ఆ సర్ప్రైజ్ ని అంజలి ఇప్పటి వరకు మర్చిపోలేదని సమాచారం. ఇప్పటికీ ఆమె ఆ కార్ లోనే తిరుగుతుందట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -
anjali

ఇక బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి తో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం లో హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా విడుదల కాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here