Mahesh Babu : కొన్ని సార్లు ఊహించని వ్యక్తులు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాము. అసలు కలలో కూడా ఊహించి ఉండరు అలాంటి వ్యక్తులు ఒకటి అవుతారని. కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం పీటల దాకా వచ్చి ఆగిపోయినవి ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి మహేష్ బాబు – బ్రహ్మీని వివాహం. బాలయ్య బాబు కి మొదటి నుండి తన పెద్ద కూతురుని మహేష్ బాబు కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకునేవాడట.

ఈ విషయాన్నీ కృష్ణ తో కూడా బాలయ్య పలు చర్చించాడని అప్పట్లో టాక్ ఉండేది. కానీ మహేష్ – నమ్రత ప్రేమించుకుంటున్నారు అనే విషయం ఇంట్లో ఎవరికీ కూడా తెలియదు. చివరి వారకు వీళ్ళ పెళ్లి విషయం కృష్ణ కి కూడా చ్చజెప్పలేదట. వీళ్లిద్దరు కృష్ణ కూతురు మంజుల తో స్నేహం గా ఉంటారు. ఆమెకి కూడా ఈ విషయం తెలియకుండా దాచారట.
అయితే మహేష్ బాబు కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టడం, అదే సమయం లో బాలయ్య నుండి కూడా ఈ ప్రపోజల్ రావడం తో, మహేష్ ఇక ఉన్న విషయాన్నీ చెప్పాలని డిసైడ్ అయ్యి నమ్రత తో ప్రేమలో ఉన్నట్టుగా కృష్ణ కి తెలిపాడట. ఆ తర్వాత వీళ్లిద్దరి పెళ్లి ఇండస్ట్రీ లో ఎవరికీ తెలియకుండా పెద్దల సమక్ష్యం లో చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

అప్పట్లో కనీసం పెళ్ళికి కూడా పిలవలేదని బాలయ్య మహేష్ , కృష్ణ పై అలిగినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. పెళ్లయ్యాక వీళ్లిద్దరు ఎంత అన్యోయంగా ఉన్నారో మన అందరికీ తెలిసిందే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అని అడిగితే మహేష్ – నమ్రత జంట ని ఉదాహరణగా చూపించొచ్చు. అంత అన్యోన్య దాంపత్యం వీళ్ళిద్దరిది.
