Samara Simha Reddy Re Release : టాలీవుడ్ ఫ్యాక్షన్ సినిమాల్లో కొత్త వరవడికి నాంది పలికిన హీరో నందమూరి బాలకృష్ణ. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమాల జాబితాలో మొదటి సినిమా సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతి బరిలో భారీ పోటీని తట్టుకొని.. కొన్ని కేంద్రాల్లో ప్రింట్లు ఆలస్యంగా చేరుకున్న అవాంతరాలను సైతం తట్టుకొని భారీ సక్సెస్ అందుకుంది. కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించింది. సంక్రాంతి పందెంకోడిగా నిలిచింది. చాలా ధియేటర్లలో ఈ సినిమాతో వచ్చిన లాభాలతోనే రీ మోడలింగ్ సౌండ్ సిస్టం ఆధునీకీకరణ ఇలాంటివి చేశారంటూ పత్రికల్లో కోకల్లలుగా వార్తలు వచ్చాయి. ఆ రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అందుకుంది.

29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడడం అంటే మూమూలు విషయం కాదు. ఇప్పుడు ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీని మరో సారి రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మార్చి 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలు మాస్టర్ ప్రింట్ తో పాటు 7.1 డాల్బీ సౌండ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి యూత్ కు ఈ మూవీ కల్ట్ ఫాలోయింగ్ గురించి తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఈ మూవీ ఓ భీభత్సం. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. ఫస్ట్ హాఫ్ లో అబ్బులుగా కామెడీ, ప్లస్ ఎమోషన్ పండించిన ఈయన సెకండ్ హాఫ్ లో వీరసింహారెడ్డిగా మాస్ యాక్షన్ తో మరో యాంగిల్ ను చూపించారు..

సిమ్రాన్, అంజలి జవేరి బాలయ్య సరసన హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఓ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ, ఈ మూవీ ప్రభావం ఇండస్ట్రీలో బాగా పడిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత సినిమా ఫ్యాక్షన్ ని బేస్ చేసుకుంటూ వందకు పైగా సినిమాలు తెరకెక్కయి. ఇక ఇటీవల స్లో అయిన ఈ రీరిలీజ్ ట్రెండ్‌కు మళ్లీ శ్రీకారం చుట్టింది పవన్ కళ్యాణ్ గంగతో రాంబాబు మూవీ. ఇక ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ రోజునే.. రవితేజ కిక్ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.