Balakrishna : నందమూరి తారకరత్న మరణం బాధాకరం..అతని కుటుంబానికి తీరని లోటు.. అతి చిన్న వయస్సులోనే చనిపోవడంతో భార్య పిల్లల పరిస్థితి దారుణంగా మారింది.. అభం శుభం తెలియని పిల్లలను చూసి అందరు జాలి పడుతున్నారు. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి వర్ణనాతీతం.. ప్రాణంగా ప్రేమించిన భర్త దూరం అవ్వడం తో కన్నీరుమున్నీరు అవుతుంది.. భర్తను తలచు కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..ఇక తారక రత్న చివరి కోరిక తీరకుండానే చనిపోయారు..తనకు ఎంతో ఇష్టమైన బాబాయ్ బాలయ్య తో కలిసి ఓ సినిమాలో నటించాలని ఉంది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.. ఇక తారకరత్న చనిపోయాక అది ఆయన చివరి కోరికగా మిగిలిపోయింది..

అయితే తారకరత్న మరణించాక బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకేక్కుతున్న సినిమాలో తారకరత్నకి ఒక కీలక పాత్ర ఇవ్వాలని అనుకున్నారట.. కానీ ఆ పాత్ర ఇచ్చే టైమ్ కి ఆయన మరణించారు అని ఓ సందర్బంలో బాలయ్య చెప్పుకొచ్చారు.. ఇదిలా ఉండగా చివరి కోరికగా బాబాయ్ బాలకృష్ణ తో నటించాలని ఉండేది కదా మరి ఆయన చివరి కోరికను తీర్చి ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలి అని భావిస్తున్నారు తారక రత్న అభిమానులు. అయితే తారకరత్న లేకుండా ఆయన చివరి కోరిక ఎలా సాధ్యం అని అందరూ అనుకున్నారు.

అదేలాగంటే.. బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో తారకరత్నను తీసుకుందామనుకున్నారు.. కాబట్టి ఆయన లేకపోయినా ఆయన ప్లేస్ లో వి ఎఫ్ఎక్స్ ని ఉపయోగించి తారకరత్న ని క్రియేట్ చేసి సినిమా తీయాలని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ముందు ముందు తెలుస్తుంది.. మరోవైపు రాజకీయాల్లోకి రావాలనే కోరికను తన భార్య అలేఖ్య ద్వారా తీర్చాలని ఆలోచనలో బాలయ్య ఉన్నారు..ఏది ఎలా జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.. ఈరోజు తారకరత్న పెద్ద కర్మను నిర్వహించనున్నారు..