Taraka Ratna నందమూరి బాలకృష్ణ కి తన అన్నయ్య కొడుకు తారకరత్న అంటే ఎంత ప్రేమ అనేది తారకరత్న గుండెపోటు వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయినా రోజే తెలిసింది.ఆయనని ICU లో అడ్మిట్ చేసిన రోజు నుండి చనిపొయ్యేవరకు బాలకృష్ణ కంటిమీద కునుకు కూడా తీసింది లేదు.తన బిడ్డ ప్రాణాలను ఎలా అయినా కాపాడుకోవాలనే తపన బాలయ్య లో మనమంతా చూసాము.కానీ చివరికి ఆయన తన ప్రాణాలను మాత్రం కాపాడలేకపొయ్యారు.
అదంతా తలరాత అనుకోవడమే.అయితే తారకరత్న చనిపోయినా కూడా ఆయన పేరు జీవితాంతం ప్రజలందరూ గుర్తుంచుకునేలా బాలయ్య బాబు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.అసలు విషయానికి వస్తే గతం లో ఆయన హిందూపురం లో ఒక హాస్పిటల్ ని నిర్మించారు.ఈ హాస్పిటల్ పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉండే ఫీజులతోనే నడిపేవాడు బాలయ్య.అయితే నేడు ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం ఏమిటంటే గుండెకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా పేద వారికి ఉచితంగా వైద్యం అందిస్తాను అంటూ ముందుకు వచ్చాడు బాలయ్య.
తన అబ్బాయి కి జరిగినట్టు ఎవ్వరికీ భవిష్యత్తులో జరగకూడదనే గొప్ప ఉద్దేశ్యం తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాలయ్య ఈ సందర్భంగా తెలిపాడు.ఈ ఆపరేషన్స్ అన్నీ హాస్పిటల్ లోని H బ్లాక్ లో నిర్వహిస్తారని.ఇక నుండి ఆ బ్లాక్ ని తారకరత్న బ్లాక్ గా నామకరణం చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఆయన తెలిపారు.పేద ప్రజలకు గుండెకి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా మా హాస్పిటల్ కి రావొచ్చని, మేము హై క్వాలిఫైడ్ డాక్టర్లతో మెరుగైన వైద్యం ఉచితంగానే అందిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య.
ఇలా తన బిడ్డలాంటి తారకరత్న పేరు మీద బాలయ్య చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.ఇది ఇలా ఉండగా తారకరత్న చనిపోయిన తర్వాత ఒంటరి అయిపోయిన ఆయన భార్య బిడ్డల బాధ్యతలను కూడా బాలయ్య తన భుజ స్కంధాలపై వేసుకున్నాడు.ఇలాంటి బాబాయి దొరకడం నిజంగా తారకరత్న అదృష్టం అనే చెప్పాలి.