Balakrishna : రికార్డులు బద్దలు.. 1116 రోజులు ఆడిన బాలకృష్ణ సినిమా ఏదో తెలుసా ?

- Advertisement -

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మంచి ఫాములో ఉన్నారు బాలయ్య. గతంలో సృష్టించిన తన రికార్డులను తానే బద్ధలు కొట్టుకుంటూ వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి ఇప్పటికీ మూడు బ్లాక్ బస్టర్స్ అందించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి లెజెండ్. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచి పదేళ్లు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకున్న సందర్భంగా మార్చి 30న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“నాకు ధన్యమైన జన్మనిచ్చి.. నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నా గురువు, నా దైవం, నా కన్నతండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వేడుక సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగలాంటి అనుభూతిని ఇస్తుంది. మార్చి 30న ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. మళ్లీ వందరోజుల పండగ జరుపుకుంటాం. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి శుభాకాంక్షలు. అభిమానులకు, తోటికళాకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారు. వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తారు. తెలుగు సినిమాల ప్రభావం యావత్ దేశానికి పాకిందంటే దాని ప్రభావం ఎంత ఉందో కళ్లముందు కనిపిస్తోంది” అని బాలకృష్ణ అన్నారు.

- Advertisement -

“సినిమా రికార్డులు నాకు కొత్త కాదు. రికార్డులు సృష్టించాలన్నా నేనే. వాటిని తిరగరాయాలన్నా నేనే. నా దర్శకులు, కథ ఎంపిక, తోటి నటులు, సాంకేతిక నిపుణులు మీద నాకు గట్టి నమ్మకం. సమరసింహా రెడ్డి 30 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ చేసుకుని దేశంలో కొత్త రికార్డులు సృష్టించింది. 105 కేంద్రాలలో వందరోజులు ఆడిన సినిమా నరసింహ నాయుడు. 400 రోజులు నాలుగు ఆటలతో రెండు కేంద్రాలలో ఆడి ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ గా నిలిచిన సినిమా లెజెండ్. అలాగే 4 ఆటలతో 1116 రోజులు ఆడి 4 అంకెల రోజుని దాటిన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా లెజెండ్. సినిమా కేవలం వినోదానికే కాదు సినిమా అంటే ఒక బాధ్యత. నా ప్రతి సినిమాలో ఆ బాధ్యత తీసుకుంటాను. సినిమా అంటే సమాజం పట్ల స్పృహ, ఒక చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథలు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. లెజెండ్‌లో మహిళలు ఉద్దేశించి ఇచ్చిన అద్భుతమైన సందేశం ఉంది.. ఇటివలే వచ్చిన నేలకొండ భగవంత్ కేసరిలో కూడా చాలా చక్కని సందేశం ఇచ్చాం. కళామతల్లి, నా తల్లిదండ్రుల, అభిమానుల ఆశీస్సులు ఉండబట్టే ఇలాంటి మంచి సినిమాలు చేయగలుతున్నానని భావిస్తున్నాను” ” అని బాలయ్య చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here