Bhagavanth Kesari : పవన్ కళ్యాణ్ కి ‘భగవంత్ కేసరి’ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన బాలకృష్ణ..రేపు ఫ్యాన్స్ కి పండగే!

- Advertisement -

Bhagavanth Kesari : ఈ దసరా కి నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదలై ఎంత మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. బాలయ్య నుండి ఇలాంటి ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో కూడిన సినిమాలు రావడం చాలా అరుదు. దానికి తోడు ఎంటర్టైన్మెంట్ ఆయన చిత్రాలలో ఉండడం చాలా తక్కువ. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలు చూసేందుకు పెద్ద ఆసక్తి చూపరు.

Bhagavanth Kesari
Bhagavanth Kesari

కానీ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ చేసిందే. ఓపెనింగ్స్ కాస్త తడబడినా, రెండవ రోజు నుండి మాత్రం చిన్నగా పుంజుకుంది. దసరా కి విడుదలైన అన్నీ సినిమాల మీద లీడింగ్ సాధించి దసరా విన్నర్ గా నిల్చింది. ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ఇకపోతే ఈ సినిమాని రేపు మూవీ టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించబోతున్నారు అట. బాలయ్య బాబు కూడా ఈ స్క్రీనింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ మరియు బాలయ్య బాబు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలం లో వీళ్లిద్దరు అనేక సందర్భాలలో కలుసుకున్నారు కూడా.

- Advertisement -

వీళ్ళు కలిసి చేసిన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఇక రేపు మరోసారి వీళ్లిద్దరు కలవబోతుండడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. మరి సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. రేపు మెగా మరియు నందమూరి అభిమానులకు వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు చూసి సంబరాలు చేసుకుంటారు అన్నమాట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here