Balagam : మొన్నటివరకు అందరి నోట ఆర్ఆర్ఆర్ పేరు వినిపించేది.. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా బలగం సినిమా పేరు వినిపిస్తుంది.. చక్కని కుటుంబ కథా చిత్రం..గుండెల్ని పిండిసే ఈ సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా తీసిన డైరెక్టర్ వేణుతో పాటు ఇందులో నటించిన వారు ఫేమస్ అయ్యారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు ఒక్కొక్కరితో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ ఇంపార్టెంటే. అందుకే ఇందులో హీరో, హీరోయిన్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులకు సరైన గుర్తింపు లభించింది. ఈ సినిమాలో చనిపోయిన కొమురయ్య కూతురుగా లచ్చవ్వ పాత్రకు మరింత గుర్తింపు వచ్చింది.. సినిమాకు ఆమె ఒకరకంగా హైలెట్ అని చెప్పాలి.. ఆమె గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అచ్చం సొంత బిడ్డలాగే నటించిన ఈమె ఏడ్వడం చూసి కన్నీళ్లు పెట్టుకోని మహళ లేరనే చెప్పొచ్చు. అయితే ఇంతకీ ఈ లచ్చవ్వ ఎవరు? ఆమె బలగం సినిమాలో నటించేటప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు?ఈ సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించిన అమె పేరు రూపలక్ష్మి. ముందుగా సీరియల్ లో నటంచిన ఆమె ఆ తరువాత 2018లో ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత కొన్ని సినిమాలో నటించినా గుర్తింపు రాలేదు. అయితే ‘బలగం’ ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రూపలక్ష్మి తన తనుభవాల గురించి చెప్పారు. మిగతా సినిమాల్లో కంటే బలగం సినిమా తీసేటప్పుడు కొన్ని సీన్స్ గురించి ఆమె చెప్పేవారట..

తండ్రికి వయసు దాటిన తరువాత బిడ్డలాగే మారుతాడు. ఆయన మనకు దూరమవుతాడు.. ఇక కనిపించడు అంటే ఆ నొప్పి మాములుగా ఉండదు.. అందువల్ల నేను తండ్రిని ముద్దు పెట్టుకోవచ్చా..అని అడిగాను. వెంటనే చేయమని చెప్పారు. నేనేదైనా సీన్ గురించి చెప్తే వెంటనే ఓకే చేసేవారు. నేను ఏ సినిమా షూటింగ్ కు వెళ్లినా డైరెక్టర్ ఏం చెబుతాడు.. నేను అనుకున్న దాన్నే మళ్ళీ మళ్ళీ చేపిస్తారు…కానీ ‘బలగం’ మూవీ షూటింగ్ సమయంలోమాత్రం స్వేచ్ఛనిచ్చారు. కొన్ని సీన్స్ నేను చెప్పినవి ఎప్పుడ వద్దనలేదు.. ‘అని అన్నారు…ఇకపోతే సీరియల్స్ కూడా నటించింది..ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది..