Baby : ఒక డైరెక్టర్.. ఒక నిర్మాతగా బ్లాక్‌బస్టర్ సినిమాను అందించి.. దానివల్ల నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడితే.. ఆ డైరెక్టర్‌కు గిఫ్ట్‌లు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. అది కూడా మామూలు గిఫ్ట్‌లు కాదు, చాలా కాస్ట్‌లీ గిఫ్ట్‌లు. ఇలా నిర్మాతలు.. డైరెక్టర్లకు కార్లు, వాచ్‌లు, గోల్డ్ గిఫ్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దానిని చూసి ఇతర నిర్మాతలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోతున్నారు. తాజాగా ‘బేబి’ మూవీ నిర్మాత కూడా అదే పనిచేశారు.

దర్శకుడికి ఒక బ్రాండ్ న్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ‘బేబీ’ రిలీజ్ అయిన మొదటిరోజే బ్లాక్‌బస్టర్ టాక్ అందుకోవడంతో ట్రోలింగ్స్ అన్నింటిని దాటి.. హిట్ అందుకుంది అని ఎస్‌కేఎన్ ‘కల్ట్ బొమ్మ ఇచ్చాం’ అంటూ మైక్ విసిరేసి మరీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్‌గా కూడా మారింది. దీంతో ఎస్‌కేఎన్‌పై మీమ్స్, రీల్స్ కూడా వచ్చాయి. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా ఇన్ని రోజులు ‘బేబీ’ సక్సెస్‌లో మునిగిపోయి ఉన్నారు ఈ నిర్మాత. ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ లభించింది.

దీంతో నిర్మాత సంతోషానికి హద్దులు లేవు. అందుకే సంతోషంతో దర్శకుడికి మెర్సిడీజ్ బెంజ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు ఎస్‌కేఎన్. తాజాగా ఎస్‌కేఎన్.. దర్శకుడు సాయి రాజేశ్‌ను తీసుకొని బెంజ్ షోరూమ్‌కు వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ వీడియో అంతా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓవైపు దర్శకుడు ఇలా గిఫ్ట్స్ అందుకుంటూ సంతోషంగా ఉంటే.. ‘బేబీ’లో నటించిన నటీనటులు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ.. ‘బేబీ’తో తన కెరీర్‌లోని అతిపెద్ద హిట్‌ను అందుకున్నాడు. తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హీరోయిన్‌గా ఛాన్సులు ఇవ్వడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు.