Baby Collections : ఈ ఏడాది అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపిన చిన్న సినిమాలే ఎక్కువ. భారీ బడ్జెట్ , హంగులు , ఆర్భాటాలతో విడుదలైన సినిమాలన్నీ బోల్తా కొట్టడం తో టాలీవుడ్ ట్రేడ్ మొత్తం పడిపోయింది. కోట్ల రూపాయిలు పెట్టి సినిమాలు కొనుక్కున్న బయ్యర్స్ అందరూ రోడ్డున పడ్డారు. వారిని ఈ ఏడాది ఆదుకున్నది చిన్న సినిమాలే.
ఇక రీసెంట్ గా విడుదలైన బేబీ అనే మరో చిన్న సినిమా విడుదలైన రోజు నుండి నేటి వరకు ప్రతీ రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ కి తక్కువ కాకుండా వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుజుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాలు కూడా వీకెండ్ తర్వాత రోజుకు సగటున కోటి రూపాయిలు కూడా వసూలు చెయ్యని ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా ఈ స్థాయి విద్వంసం సృష్టించడం అనేది సాధారణమైన విషయం కాదు.
ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏనీత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. మొదటి రోజు బేబీ చిత్రానికి 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 7 వ రోజు కూడా రెండు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టీ ఈ చిత్రం ఏ రేంజ్ సునామి లాంటి వసూళ్లను రాబడుతుందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఊపుని ఈ సినిమా రెండవ వీకెండ్ లో కూడా కొనసాగిస్తుందని, ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు.