Baby : రీసెంట్ సమయం లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపే చిన్న సినిమాలు ఎక్కువ అయ్యాయి. సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , నందమూరి బాలకృష్ణ ‘వీర సింహ రెడ్డి’ సినిమాలు పెద్ద హిట్ అహఁయ్యాక , ఆ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఫ్లాప్స్ గా మిగిలి బయ్యర్స్ కి ఘోరమైన నష్టాలను తెచ్చిపెట్టాయి. అలాంటి సమయం లో ఇండస్ట్రీ ని ఆదుకున్నవి చిన్న సినిమాలే.

రీసెంట్ గా ‘ఆదిపురుష్’ చిత్రం నష్టాలతో డీలాపడిన బయ్యర్స్ కి ‘సామజవరగమనా’ అనే చిత్రం కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘బేబీ’ చిత్రం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ రోజు నుండే సునామి లాంటి వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టించ్చింది. ఈ చిత్రం విడుదలై నేటికీ 5 రోజులు పూర్తి అయ్యింది. ఈ 5 రోజులకు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.

మొదటి రోజు ఈ చిత్రానికి 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీనిని అద్భుతమైన ఓపెనింగ్ అని అందరూ అనుకున్నారు. కానీ రెండవ రోజు మొదటి రోజు కంటే అదనంగా మరో 30 లక్షలు వచ్చింది. ఇక మూడవ రోజు అయితే ఏకంగా కోటి రూపాయిలు అదనంగా వచ్చాయి. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఇసుమంత కూడా తగ్గకపోగా వీకెండ్ వచ్చిన వసూళ్ల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

అలా నాలుగు రోజులు పూర్తి చేసుకున్న బేబీ చిత్రం 5వ రోజు 2 కోట్ల 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా 5 రోజులకు కలిపి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు చూస్తే 18 కోట్ల 71 లక్షల రూపాయలకు పైగా ఉంది.
