చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సినిమా బేబి. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై సంచలనాలు సృష్టిస్తోంది. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అందులో నటించిన యాక్టర్లకు మంచి గుర్తింపు లభించింది. సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించారు. అలాగే పాపులర్ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది.

ఈ మూవీలో ప్రస్తుత యువత ఒకరి చేతిలో ఒకరు ఎలా మోసపోతున్నారనే అంశాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు సాయి చైతన్య. దీంతో అప్పట్లో వచ్చిన 7/G బృందావన కాలనీ సినిమా మాదిరి బేబీ కూడా ఈ సినిమా కుర్ర కారుకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాతో మొదటిసారిగా హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య నటనకు కోట్లాదిమంది ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా వైష్ణవి చైతన్య పేరే. బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి. ప్రజెంట్ ఆమె పలు చిత్రాలకు ఎంపిక అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అమ్మడికి ఓ భారీ ఆఫర్ కూడా వచ్చిందని తెలుస్తోంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కనున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో వైష్ణవి నటించబోతుంది అంటూ సమాచారం. ఇదిలా ఉంటే వైష్ణవికి ఈ సినిమా తరువాత ఫ్యాన్స్ పెరిగిపోయారు. ప్రజెంట్ కథల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తను సెలక్ట్ చేసుకునే కథలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని వైష్ణవి కూడా ఎంతో ట్రై చేస్తుందట. అలాంటి కథతోనే తన నెక్స్ట్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుందని టాక్.
