ఆదిపురుష్ ను దారుణంగా అవమానించిన బాబుగోగినేని.. మండిపడుతున్న ఫ్యాన్స్

- Advertisement -

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌కి హిట్ లేదు.. రాజమౌళితో సినిమా చేస్తే వద్దంటే ఓ పదేళ్లు గుర్తుపెట్టుకునేట్టుగా సూపర్ డూపర్ హిట్ ఇస్తారనేది ఎంత నిజమే.. ఆయనతో సినిమా చేశాక మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలంటే ఏళ్లకి ఏళ్లు పడుతుందనేదీ అంతే నిజం. బాహుబలి సినిమా తరువాత.. సాహో, రాధేశ్యామ్ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించారు ప్రభాస్. ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ‘ఆదిపురుష్’ సినిమాతో అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు ప్రభాస్.

ఆదిపురుష్
ఆదిపురుష్

తాజాగా ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ ఫేం బాబు గోగినేని.. ‘ఆదిపురుష్’ చిత్ర యూనిట్‌పై సెటైర్లు వేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘సినిమా హాల్‌ను గుడిగా మార్చడానికి పర్మిషన్ ఉందా? అక్కడ భక్తులకు కొబ్బరికాయలు కొట్టే సదుపాయం ఏర్పాటు చేశారా? ప్రదర్శనశాల గుడిగా మారితే, భక్తులు పూజలు చేసుకోవాలంటే కంచు గంటలూ, భక్తులు ఆశీర్వాదం పొందడానికి ఒక దేశీ ఆవు.. సరైన కులం నుండి ఒక పూజారీ.. హల్‌‌లో నిత్యాన్నదానం కోసం హుండీలూ ఉండాలి కదా? పరమతస్తులు సినిమా చూడాలంటే టిక్కెట్ కొనే ముందు రిజిస్టర్‌లో సంతకం పెట్టాలి కదా? రిజిస్టర్‌లు పెట్టారా?

Adipurush Babu Gogineni

అలాగే.. థియేటర్‌లో అప్రాచ్యపు యురోపియన్ల చిప్స్, మెక్సికన్ల పాప్కార్న్, అమెరికన్ల బర్గర్లు, కోకులు అమ్మవచ్చా? అమ్మే వాళ్ళ మతాలు, కులాలు తెలుసుకున్నారా? నిజానికి నిర్మాతలు ప్రసాదం ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలి కదా? చేస్తున్నారా? బహిష్టులో ఉన్న ఆడవారు బ్రహ్మచారులు ఉన్న సినిమా హాల్‌లోకి, లేక సినిమా ప్రదర్శిస్తున్న గుడులలోకి ప్రవేశించవచ్చునా?

- Advertisement -

ఏది ఏమైనా, నియమం ప్రకారం మగవాళ్ళు చొక్కా లేకుండా, ఎవరు కూడా లోనికి తోలు వస్తువులు తీసుకురాకుండా, తోలు బెల్టులు లాంటివి ధరించకుండా, చెప్పులు లేకుండా లోనికి వెళ్ళాలి కదా? రాహు కాలంలో షో ఉంటే ఏమి చేయాలి? హాలు వాస్తు ప్రకారం లేకపోతే రెమెడీ ఎవరు ఇవ్వాలి? తూర్పుకు దండం పెట్టుకోవాలంటే.. లేదూ సేతువు ఎటు వైపు ఉందో చూపించే దిక్సూచి ప్రతి హాల్‌లో ఉంటుందా? శుభం.. అంటూ సెటైర్లు వేస్తూ పోస్ట్ పెట్టారు బాబు గోగినేని. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులంతా మండిపడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here