Ms Narayana మన టాలీవుడ్ లో కమెడియన్స్ కి కొదవే లేదు, పొట్టచెక్కలు అయ్యే రేంజ్ లో నవ్వించే వారు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి వారిలో లెజండరీ స్థానం ని దక్కించుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. అలా ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ టాలీవుడ్ టాప్ 2 కమెడియన్స్ గా సూర్యచంద్రులు లాగా ఒక వెలుగు వెలిగిన లెజెండ్స్ బ్రహ్మానందం మరియు MS నారాయణ.

ముఖ్యంగా ఏం ఎస్ నారాయణ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వృత్తి రీత్యా లెక్చెరర్ గా కొనసాగుతున్న రోజుల్లోనే ఎన్నో గొప్ప రచనలు చేసారు. అవి చూసి స్వయంగా ఆయన కాలేజీ వాళ్ళే మద్రాసు ట్రైన్ ఎక్కించి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చెయ్యమని పంపారట. అలా ఒక రచయితగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు కమెడియన్ గా స్థిరపడి ఇండస్ట్రీ లో లెజండరీ స్థానాన్ని అందుకున్నాడు.

భౌతికంగా ఈరోజు ఆయన మన మధ్య లేకపోయ్యుండొచ్చు, కానీ ఆయన పోషించిన పాత్రల ద్వారా కలకలం చిరస్థాయిగా అందరికీ గుర్తుండిపోతాడు. ఇది ఇలా ఉండగా గతం లో ఏం ఎస్ నారాయణ తన జీవితం లో ఎదురైనా కొన్ని సంఘటలను పంచుకున్నాడు. అందులో ఒక భయంకరమైన సంఘటన గురించి చెప్తూ ‘ఒక రోజు నేను చెన్నై కి వెళ్తున్న సమయం లో ఒక 7 మంది నేను పడుకున్న బెర్త్ క్రింద వచ్చారు.
అవతల టీసీ వస్తున్నాడు, వీళ్ళ దగ్గర టికెట్స్ లేవు, అప్పుడే ఒక అతను నా దగ్గర కూడా టికెట్ లేదు, వచ్చే స్టేషన్ ఒంగోలు వస్తుంది, నేను అక్కడ దిగి వెంటనే టికెట్స్ తీసుకొస్తాను, ఒకవేళ నేను రాకపోతే పైన ఉన్న మా తమ్ముడిని అడగండి అని నావైపు చూపించి క్రిందకి దిగి వెళ్ళిపోయాడు. ట్రైన్ కదిలిపోతుంది, కానీ ఎంతకీ కూడా క్రిందకి దిగిన వాడు రాకపోవడం తో ఏం ఎస్ నారాయణ ని నిద్రలేపి మీ అన్నయ్య టికెట్స్ కోసం అని వెళ్లి ఇంకా రాలేదు సార్ అని అన్నాడు. అప్పుడు నేను మా అన్నయ్య ఎవరు, నాతో ఎవరూ రాలేదే అని అన్నాను.
అప్పుడు ఏం ఎస్ నారాయణ సూట్ కేసు ని లాక్కొని,ఏంటి తమాషాలు పడుతున్నారా ఇద్దరు అని నా మీదకి కొట్టడానికి వచ్చారు. చంపేస్తాము అని కూస్తో బెదిరింపులు చేసారు. అప్పుడు నేను కూడా ఊరుకోలేదు, మీ అంత బలవంత కాదు కాకపోయియుండొచ్చు, కానీ మీ పీక కోసేస్తాను అని బెదిరించాను, ఆ తర్వాత గూడూరు రైల్వే స్టేషన్ దిగగానే ఆ 7 మందిపై ప్యాసెంజర్లపై కంప్లైంట్ చేసి పట్టుబట్టించాను’ అంటూ చెప్పుకొచ్చాడు ఏం ఎస్ నారాయణ.