తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమా పేరు ఎత్తితే గతం లో ఆ చిత్రం తాలూకు మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కొడితే ఇలాంటి హిట్ కొట్టాలి అనుకుంటారు. అలాంటి చిత్రాలలో ఒకటి ‘అత్తారింటికి దారేది’. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అప్పట్లో ‘మగధీర’ అనే చిత్రం తప్ప, మిగిలిన ఏ సినిమా కూడా 70 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టలేదు.

అలాంటి రోజుల్లో అత్తారింటికి దారేది అనే చిత్రం అతి తేలికగా 75 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అప్పట్లో ఈ సినిమా విడుదలకు ముందే HD ప్రింటు తో పైరసీ కి గురై ఎలాంటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.ఆ పైరసీ ని కూడా ఎదురుకొని ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమాలో ఎవ్వరూ గమనించని కొన్ని చిన్న చిన్న షాట్స్ ఉన్నాయి. అవి ఇప్పటి వరకు ఎవ్వరూ గమనించలేదు. ఈ చిత్రం అంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి క్లైమాక్స్. ఈ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకుల హృదయాలను కలిగించింది. పవర్ స్టార్ లాంటి హీరో తో ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ ని ప్లాన్ చెయ్యడం అంటే , త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహసానికి మెచ్చుకోవచ్చు.అయితే ఈ క్లైమాక్స్ సన్నివేశం లో మీరు ఒక విషయం గమనించాలి.

నదియా పవన్ కళ్యాణ్ తో ‘ఫోన్ చెయ్ రా గౌతమ్’ అనే షాట్ లో ఆమె వెనుక చివర్లో ఒక వ్యక్తి నిలబడుకొని ఉంటాడు. అతను ఎవరో అనుకుంటే పొరపాటే, అతను మరెవరో కాదు , మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆరోజు షూటింగ్ ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు షూటింగ్ కి వచ్చాడట. ఆ సమయం లో షాట్ జరుగుతుండగా ఆయన సెట్స్ బయట నిల్చొని ఫోన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడట. అలా ఫ్రేమ్ లో ఆయనకీ తెలియకుండానే వచ్చేసాడు. ఈ విషయం అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా ఇంటర్వ్యూ లో చెప్పాడు.
