Astrologer Venu Swamy మళ్ళీ వాళ్ళ జోలికి పోనూ అంటూ వేణుస్వామి సంచలన కామెంట్స్..అక్కినేని ఫ్యాన్స్ చుక్కలు చూపించేసారుగా!

- Advertisement -

Astrologer Venu Swamy రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య – శోభిత పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ఎంతటి దుమారం రేపాయో మన అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జగన్ మరోసారి సీఎం అవుతాడని చెప్పిన వేణుస్వామి, అది నిజం కాకపోవడంతో ఇక నుండి నేను ఏ హీరోకి సంబంధించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ జాతకాలు చెప్పను అంటూ ఒక వీడియో బైట్ విడుదల చేసాడు. అలా చెప్పిన ఈ వ్యక్తి నేడు నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగిన వెంటనే వాళ్ళిద్దరి జాతకాలను తెల్ల బోర్డు మీద చెప్తూ వీడియో బైట్ చేసాడు. నాగ చైతన్య – శోభిత 2027 వ సంవత్సరం లో ఒక స్త్రీ కారణంగా విడిపోతారు అంటూ కామెంట్స్ చేసాడు.

Astrologer Venu Swamy
Astrologer Venu Swamy

దీనిపై అక్కినేని అభిమానుల నుండి, అలాగే నెటిజెన్స్ నుండి వేణు స్వామి చాలా తీవ్రమైన ట్రోలింగ్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. వాళ్లిద్దరూ నిన్ను జాతకాలు చెప్పమని ఏమైనా అడిగారా?, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ జాతకాలు చెప్పడానికి నువ్వు ఎవరివి?, శుభమా అంటూ పెళ్లి చేసుకున్న జంట విడిపోవాలని కోరుకుంటావా అంటూ ఒక అభిమాని వేణు స్వామి కి ఫోన్ చేసి బూతులు తిట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Astrologer's SHOCKING prediction: Naga Chaitanya, Sobhita to 'separate' THIS year | Celebrity News - News9live

- Advertisement -

ఇలా తీవ్రమైన వ్యతిరేకతను, ట్రోలింగ్స్ ని భరించలేకపోయిన వేణు స్వామి, మరోసారి వీడియో బైట్ చేస్తూ ‘ఇక నుండి నేను ఎవరి జాతకాలను చెప్పదల్చుకోలేదు. ఎన్నికల ఫలితాల సమయంలో నేను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాను. నాగ చైతన్య కి అప్పట్లో నేను చెప్పిన వైవాహిక జీవితానికి కొనసాగింపుగా మాత్రమే నేను ఈ జాతకం చెప్పాను కానీ, వేరే ఉద్దేశ్యం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా వేణు స్వామి పై ట్రోలింగ్స్ ఆగలేదు. అందరి జాతకాలు చెప్తాను అంటున్నావ్ కదా, నీ జాతకం మేము చెప్తాము రెడీ గా ఉండు, మీ ఇంటికి వస్తున్నాం అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా లో వేణు స్వామి ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. మరి వేణు స్వామి ఇప్పటికైనా చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాడా?, లేదా మళ్ళీ ఇంకొకరి జాతకం తో మన ముందుకు వస్తాడా అనేది చూడాలి.

Astrologer Venu Swamy Trolled for Wrong Prediction on Jagan in AP Polls

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here