Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 లోకి వేణు స్వామి.. రోజుకు అన్ని లక్షల రెమ్యూనరేషనా?

- Advertisement -

తెలుగు బుల్లితెర పై సక్సెస్ ఫుల్ టాక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో అంటే బిగ్ బాస్ అనే చెప్తారు.. తెలుగు ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఎనిమిదో సీజన్ ను త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఇప్పటికే సెట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.. గతంలోలాగా సెలెబ్రేటిలను కాకుండా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న వాళ్లను ఎక్కువగా తీసుకొచ్చే ప్లాన్ లో యాజమాన్యం ఉంది.. అందులో భాగంగానే బర్రెలక్క, కుమారి ఆంటీ, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి.. ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి…

ఇక తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా అవినిపిస్తుంది.. సెలెబ్రేటీలకు, రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెబుతూ సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అయ్యాడు.. అంతేకాదు వివాదాలకు కేరాఫ్ గా కూడా మారాడు.. వేణు స్వామి చెప్పినవి కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. దీంతో వేణుస్వామి ఇటీవల ఇకపై జ్యోతిష్యం చెప్పను అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే వేణుస్వామి వద్దకు అనేకమంది హీరోయిన్స్, సినిమా సెలబ్రిటీలు వెళ్లి మరీ పూజలు చేయించుకోవడంతో ఆ సెలెబ్రేటీలు కూడా పాపులర్ అయ్యారు..

- Advertisement -

ఇదిలా ఉండగా.. వేణు స్వామి బిగ్ బాస్ 8 తెలుగు షోలోకి కంటెస్టెంట్ గా రాబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.. అంతేకాదు వేణుస్వామికి ఉన్న క్రేజ్ ను బిగ్ బాస్ వాడుకోవాలనుకుంటుంది. ఇప్పటికే వేణుస్వామిని సంప్రదించినట్టు, భారీగా అమౌంట్ ఆఫర్ చేసినట్టు, ఇందుకు వేణుస్వామి కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. వేణుస్వామి వస్తే టీవీలో టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే పెరుగుతుందని భావిస్తుంది.. ఈయన ఇక్కడ కూడా జాతకాలు చెబుతాడా లేక గేమ్ ఆడతాడా అనేది చూడాలి.. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉండబోతుందని తెలుస్తుంది.. అంటే రోజుకు రూ. 3 నుంచి 5 లక్షల వరకు ఉండవచ్చునని సమాచారం.. ఏది ఏమైనా సీజన్ 8 మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా ఉండబోతుందని తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here