Venu Swamy : సోషల్ మీడియా లో స్టార్ సెలెబ్రిటీల జాతకాలపై ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నిత్యం ట్రెండింగ్ లో ఉండే వ్యక్తులలో ఒకడు వేణు గోపాల స్వామి. గతం లో ఇతనొక దొంగ స్వామిజి అని బాబు గోగినేని అనే వ్యక్తి ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో నిరూపించాడు. ఆ సంఘటన తర్వాత ఇతన్ని ఎవ్వరూ నమ్మరేమో అని అనుకున్నాం. కానీ చీకట్లో బాణం వదిలినట్టు,ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ విషయం లో ఇతని చెప్పినవి జరిగాయి.

అప్పటి నుండి ప్రతీ స్టార్ సెలబ్రిటీ విషయం లో నోరు పారేసుకోవడం ఇతనికి అలవాటు అయిపోయింది. ఇతని నోటి నుండి శుభప్రదమైన మాటలు ఒక్కసారి కూడా రాలేదు. అప్పుడే పుట్టిన రామ్ చరణ్ బిడ్డ మీద కూడా ఇతను ఆమెలో లోపాలు ఉన్నాయి అంటూ కామెంట్ చేసాడంటే, పాపులారిటీ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇవన్నీ పక్కన పెడితే ఇతన్ని నమ్మే సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు. ఇతను చెప్పే దోషాలు నిజమేనేమో , శాంతి పూజ చేయిస్తే మంచిది అని కొంతమంది హీరోయిన్లు పూజలు కూడా చెయ్యికున్నారట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన సంపాదన గురించి చెప్పుకొచ్చాడు. ఇతను ఒక్క గంటసేపు పూజ చేస్తే 5 నుండి 10 వేల రూపాయిలు తీసుకుంటాడట. ఇతనికి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి.

హైదరాబాద్ లో ఒక పబ్ ని కూడా మైంటైన్ చేస్తున్నాడట. మంత్రాలు చదివే ఈ వ్యక్తి పబ్బులను నడపడం మనమంతా గమనించాల్సిన విషయం. అలా నెలకి ఇతని సంపాదన 15 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందట. కొంతమంది మీడియం రేంజ్ హీరోలు ఎంతో శ్రమపడి సినిమాలు చేసినా కూడా ఇంత డబ్బులు సంపాదించలేకపోతున్నారు. అలాంటిది ఈ వివాదాస్పద జ్యోతిష్యుని జీవితం ఎలా నడుస్తుందో మీరే చూడండి.
