ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం నడిపి.. ఇప్పుడు ఇద్దరినీ వదిలేసిన అషూరెడ్డి

- Advertisement -

అషూ రెడ్డి బిగ్ బాస్ షోలో ఉన్న టైంలో.. తన ప్రేమ కథ, బ్రేకప్ విషయాలు, డిప్రెషన్‌లోకి వెళ్లడం అన్నింటి గురించి చెప్పింది. అయితే అషూ రెడ్డి మళ్లీ ఇంత వరకు ప్రేమలో పడినట్టుగా కనిపించడం లేదు. రాహుల్ సిప్లిగంజ్‌తో పార్టీలు, పబ్బులు అని తిరుగుతుంది. కానీ తమ ఇద్దరి మంచి దోస్తాన్ అని చెబుతుంటారు. ఎక్స్ ప్రెస్ హరితో టీఆర్పీ కోసం లవ్ ట్రాక్ అషూ రెడ్డి నడిపించినట్టు అనిపిస్తుంది. ఇలా ఇద్దరితో ప్రేమాయణం నడిపిన అషూ ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నట్లు తెలుస్తుంది.

అషూరెడ్డి
అషూరెడ్డి

ఇటీవల ఒక రెడ్ డ్రెస్ ఫొటో పెట్టిన అషూ రెడ్డి..ఈ రెడ్ డ్రెస్ మళ్లీ నన్ను నాతో ప్రేమలో పడేసేలా చేసింది అని అషూ రెడ్డి చెప్పుకొచ్చింది. దీనిపై హెయిర్ స్టైలిష్ట్ రవి స్పందించాడు. మళ్లీ లవ్ అంటే కష్టమే అని కౌంటర్లు వేశాడు. దానికి అషూ ఇలా రియాక్ట్ అయింది. ఒకసారి లైఫ్‌లో హర్ట్ అయింది చాలు.. అంటూ దండం పెట్టేసింది. సోలో లైఫ్ సో బెటర్ అని రవి నవ్వేశాడు. వీరిద్దరి సంభాషణ అందరినీ ఆకట్టుకుంటుంది.

Ashu reddy Photos

అషూ రెడ్డి లవ్ స్టోరీలో ఆమె ఫ్రెండే మోసం చేసిందని, మళ్లీ తన ఫ్రెండ్ తన లవర్ ఒక్కటయ్యారని, ఆ ఫ్రెండే మోసం చేయడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్టుగా అషూ రెడ్డి బిగ్ బాస్ ఇంట్లో చెప్పేసింది. ఇక బయటకు వచ్చిన తరువాత రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డిలు సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు. అషూ రెడ్డి అయితే కావాలనే రాహుల్ తన గుండెల్లో ఉన్నాడని మరింతగా నెటిజన్లను రెచ్చగొట్టేది. అషూ రెడ్డి ఇక కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో కలిసి లవ్ ట్రాక్ నడిపించినట్టుగా అనిపిస్తుంది. అయితే అషూ రెడ్డి ఇక సింగిల్‌గానే ఉండాలని ఫిక్స్ అయినట్టుగా ఈ పోస్ట్ ద్వారా కనిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here