డ్రగ్స్ కేస్ పై స్పందించిన అషు రెడ్డి.. ఆ విషయంలో నన్ను ఇరికిస్తున్నారు అంటూ ఎమోషనల్..

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ మాట వినిపిస్తుంది.. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి.. ఇటీవల ప్రముఖ నిర్మాత అయిన కేపీ చౌదరిని డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుండి భారీ సంఖ్యలో కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. కోర్టు అనుమతితో అతడిని రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఈమేరకు నమ్మలేని నిజాలు బయటికి వచ్చినట్టు తెలుస్తుంది.. కేపీ చౌదరి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ అలాగే మరో నటితోనూ వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు.

అషు రెడ్డి
అషు రెడ్డి

విచారణ సమయంలో ఈ కాల్స్ పై అతడు అస్సలు నోరు విప్పలేదు.. కేపీ చౌదరి నుంచి డ్రగ్స్ అందుకునే ఖాతాదారుల్లో ఎంతో మంది సెలెబ్రిటీలు కూడా ఉన్నట్టు పోలీసుల విచారణలో వెళ్లడయింది.. ఈ క్రమంలో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డిని కూడా ఇందులోకి లాగారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది..టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా ఆమె ఖండించారు.. సోషల్ మీడియా లో పేర్కొన్నట్లు తనకు ఎవరితో కూడా ఎలాంటి సంబంధాలు లేవని తనపై వచ్చిన వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలని అషు రెడ్డి తెలిపింది.

Ashu Reddy Images

అంతేకాదు అవసరమైతే, సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులకు అస్సలు నిజం ఏంటో వివరిస్తానని స్పష్టం చేసింది… నా ఫోన్ నంబర్ ను బయటకు తెలిసేలా చేస్తే అస్సలు ఊరుకోనని అషు వార్నింగ్ ఇచ్చింది.. తన పై ఇలాంటి నిందలు ఎందుకు వేస్తున్నారో అర్ధం కావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అషు రెడ్డి.. తన పనేంటో తాను చేసుకుంటున్నా కూడా ఇలాంటి నిందలు వెయ్యడం భాధకారం అంటూ అషు ఆవేదన వ్యక్తం చేస్తుంది.. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here