Ashu Reddy : సోషల్ మీడియా లో జూనియర్ సమంత గా మంచి పేరు తెచ్చుకున్న సెలబ్రిటీ అషు రెడ్డి.ఇంస్టాగ్రామ్ లో మొదటి నుండి సెలబ్రిటీ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అషు రెడ్డి, ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది.అప్పటి వరకు కేవలం సోషల్ మీడియా ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైన అషు రెడ్డి, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులకు దగ్గరైంది.

గత ఏడాది ఈమె బిగ్ బాస్ OTT లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.అయితే సోషల్ మీడియా లో ఈమె రామ్ గోపాల్ వర్మ తో చేసిన రొమాన్స్ ఎంత హైలైట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..అలా ఎల్లప్పుడూ బోల్డ్ గా ఉంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే అషు రెడ్డి రీసెంట్ గా చేసిన మరో బోల్డ్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘జనాలకు నా బ్యాక్ ఫోటోలంటే బాగా ఇష్టం.. అందుకే అందరూ నా వెనుక చేరి మాట్లాడుతూ ఉంటారు.. నేను అప్లోడ్ చేసే ఫోటోలలో ఎక్కువ లైక్స్ మరియు రీచ్ వచ్చేది బ్యాక్ ఫొటోలకే, అందుకే నా ఫ్యాన్స్ కోసం ఎప్పుడు అలాంటి ఫొటోలే పెడుతుంటాను’ అని చెప్పుకొచ్చింది అషు రెడ్డి. చూడడానికి సమంత లాగ ఉండే అషు రెడ్డి కి అందం తో పాటు అభినయం కూడా ఎక్కువే.

కానీ దానికి తగట్టుగా మాత్రం టాలీవుడ్ లో అషు రెడ్డి ఆఫర్స్ రావడం లేదు, అడపాదడపా పలు సినిమాల్లో హీరోయిన్ పక్క స్నేహితురాలి పాత్రలు లభించినప్పటికీ,ఆమె అందం కి పాపులారిటీ కి ఆ పాత్రలు తక్కువ రేంజ్ అనే చెప్పాలి.రీసెంట్ గా స్టార్ మా లో ప్రసారమయ్యే ‘BB జోడి‘ అనే ప్రోగ్రాం లో మెహబూబా కి జోడిగా వచ్చింది కానీ మధ్యలోనే ఎందుకో డ్రాప్ అయ్యింది. ఇప్పుడు అషు రెడ్డి అడుగులు ఎటు వైపో చూడాలి.