తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు మరోమారు చర్చనీయాంశంగా మారింది. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ‘కబాలి’ సినిమాను తీసిన నిర్మాత కేపీ చౌదరి ఈమధ్య డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ కేసులో అతడ్ని విచారించేందుకు కోర్టు నుంచి పోలీసులు అనుమతి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో కేపీ చౌదరి ఫోన్‌ను పరిశీలించగా.. పలువురు మూవీ సెలబ్రిటీల పేర్లు బయటపడ్డాయి.

ఈ లిస్టులో టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి పేరు వినిపించింది. అలాగే బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు కూడా ఈ కేసులో ప్రముఖంగా వినిపించింది. కేపీ చౌదరితో ఆమె గంటల తరబడి ఫోన్ కాల్లో మాట్లాడారని పలు మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై అషురెడ్డి క్లారిటీ ఇచ్చారు. డ్రగ్స్ కేసు వార్తలపై ఆమె సీరియస్ అయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలను మరోసారి తీవ్రంగా ఖండించారు అషురెడ్డి. కొన్ని మీడియా ఛానళ్లు చెబుతున్నట్లు ఎవరితోనూ తనకు సంబంధాలు లేవని ఆమె క్లారిటీ ఇచ్చారు.డ్రగ్స్ కేసులో టైమ్ వచ్చినప్పుడు నిజానిజాలు ఏమిటో సంబంధిత అధికారులకు పూర్తిగా వివరిస్తానని అషురెడ్డి స్పష్టం చేశారు. తాజాగా మరోమారు డ్రగ్స్ కేసు వార్తలపై స్పందించారు అషు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె ఒక వీడియోను పోస్ట్ చేశారు. కొన్ని మీడియా ఛానళ్లు తనను కించపరిచేలా వార్తలు రాశాయని చెప్పారామె.

తన పేరు, ఫోన్ నంబర్ టెలికాస్ట్ చేయడంతో మానసికంగా ఇబ్బందులు ఫేస్ చేశానన్నారు. నంబర్ టెలికాస్ట్ చేయడంతో తనకు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని అషురెడ్డి పేర్కొన్నారు. కేపీ చౌదరితో తాను గంటల తరబడి మాట్లాడినట్లు చెబుతున్నారని.. అతడితో ఉన్న పరిచయం, ఫోన్ కాల్స్‌పై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అషురెడ్డి చెప్పుకొచ్చారు. తనను కించపరిచేలా వ్యవహరించిన మీడియా ఛానళ్ల మీద పరువునష్టం దావా వేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఆమె దగ్గర ఫోన్ కాల్ లిస్ట్ ఉందని నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి అని నిజ నిజాలు ఏంటో నేను నిరూపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.అయితే ఈ ఘటన జరిగినప్పుడు ఆమె వేరే కంట్రీలో ఉందట. ఇక ఈ కేసులో ఆమెకి ఎటువంటి సంబంధం లేదు. అంటూ ఈ సందర్భంగా తెలియజేసింది ఆమె.