నటుడు ఆశిష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో సినిమాలతో ద్వారా మనకు సుపరిచితుడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించాడు. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్‌గా అతడి నటన నెక్ట్స్ లెవల్‌లో క్లిక్ అయ్యింది. గతంలో ఎక్కువ విలర్ రోల్స్ చేసిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు. తాజాగా 60 ఏళ్ల వయస్సులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం.. అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను గురువారం కోల్‌కతా క్లబ్‌లో ఆశిష్ విద్యార్థి పెళ్లాడారు.

ప్రస్తుతం ఈయన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలీ బారువా(Rupali Barua)ను గురువారం(మే 25) అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆశిష్ విద్యార్థి వివాహం చేసుకున్నాడు. ఇది ఈయనకు రెండో వివాహం. గతంలో నటి శకుంతల బారువా కూతురు రాజోషి బారువాను పెళ్లి చేసుకోగా వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు ఉన్నాడు. అయితే.. విబేధాల కారణంగా వీరు విడిపోయారు.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆశిష్, రూపాలిలు రిజిస్ట్రీ వివాహం చేసుకున్నారు. అస్సాంకు చెందిన తెలుపు, బంగారు రంగు మేఖేలా చాదర్‌లో రూపాలి అందంగా కనిపించింది. వివాహం అనంతరం ఆశిష్ మాట్లాడుతూ.. నా జీవితంలో ఈ దశలో రూపాలిని వివాహం చేసుకోవడం ఒక అసాధారణ అనుభూతి అంటూ చెప్పుకొచ్చాడు. కోల్‌కతాలో ఓ ఫ్యాషన్ స్టోర్‌ని రూపాలి రన్ చేస్తోంది. వీరి పెళ్లి విషయం తెలుసుకున్న నెటీజన్లు, అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.