Ariyana Glory : బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్యూటీ సీజన్ 4లో బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాప్ 5లో స్థానం సంపాదించుకుంది. థర్డ్ రన్నరప్‌గా హౌస్ నుండి బయటకు వచ్చిన ఆమె హౌస్‌లో ఉన్నప్పుడు ముక్కుసూటిగా మాట్లాడేది. తప్పు జరిగితే నేరుగా ఎవరినైనా ప్రశ్నించండి. అయితే నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉందని అని సమంత ఓ సందర్భంలో ఆమెను ఉద్దేశించి మాట్లాడడం గమనార్హం.
ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది అరియానా. ఈ ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది. అరియానాకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చి ఈ రేంజ్ లో పాపులర్ అయ్యింది అంటే క్రెడిట్ అంతా రాంగోపాల్ వర్మకే చెందుతుంది. అయితే అరియానా.. రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేస్తూ నువ్వు చాలా హాట్ గా ఉన్నావు.. నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు అరియానా.. ఆర్జీవీ కోరిక తీరింది. తొలిసారి బికినీలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఇక మొదట్లో చాలా బక్కగా ఉన్న ఈ క్యూట్ గర్ల్ తాజాగా కాస్త బొద్దుగా మారిపోయింది.
ఇటీవల తన బాడీపై అనేక విమర్శలు వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన ఈ బ్యూటీ సన్నగా ఉన్నా.. లావైనా.. రెండు విధాలుగాను విమర్శిస్తారు. నా బాడీ నా ఇష్టం. మీరెవరు నన్ను ప్రశ్నించడానికి అంటూ మండిపడింది. ఇక తాజాగా బికినీలో అరియానా కుర్రాళ్ళను కవిస్తూ హాట్ ఫోజులిచ్చింది. టెంప్ట్ చేసే విధంగా తన అందాలను బయటపెట్టింది. అయితే ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తిగా సిగ్గు వదిలేసావా తల్లి అంటూ.., బికినీలో ఈ రేంజ్లో బరితెగించాలా అంటూ.. , ఇప్పటివరకు బాగనే ఉన్నావుగా అంటూ.. తలోరకంగా నెటిజన్స్ అరియానా పై ఫైర్ అవుతున్నారు.