కన్నడ హీరో యష్ అంటే తెలియకపోవచ్చు … రాఖీ భాయ్ అంటే చిన్న పిల్లాడు సైతం ఠక్కున గుర్తు పట్టేస్తాడు. అంతలా సినీ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. యష్ కెరీర్ కేజీఎఫ్ కి ముందుకు కేజీఎఫ్ తర్వాత అనేలా మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన కేజిఎఫ్ -1,2 సినిమాలతో పలు రికార్డులను నెలకొల్పాడు. కేజీఎఫ్ తో ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. కేజీఎఫ్ కంటే ముందు యష్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడని తెలుస్తోంది. యష్. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

నిజానికి యష్ .. అసలు పేరు నవీన్.. తను కర్ణాటకలోని హాసన్ అనే గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.. తన తల్లి తన కుమారుడు నవీన్ పేరును యశ్వంత్ గా మార్చారట. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక యష్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. యశ్వంత్ కు స్కూలుకు వెళ్లే టైంలోనే సినిమాలపై ఆసక్తి ఉండేదట. దీంతో 16 సంవత్సరాల వయసులోనే ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా అవకాశం వచ్చిందట. దీంతో ఆయన ఆ ప్రాజెక్ట్ నిమిత్తం బెంగళూరుకి వెళ్లారట. ఆ సమయంలో తన చేతిలో కేవలం ఉన్నవి రూ.300మాత్రమేనట. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశాలు సంపాదించకపోవడానికి థియేటర్ ట్రూపులో బ్యాక్ డ్యాన్సర్ గా కూడా పని చేశారట. ఆ సమయంలో రోజుకి 50 రూపాయలు ఇచ్చే వారట. అలా చేస్తూనే 18ఏళ్ల వయసులో ఒక నాటకంలో మెయిన్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. అది చూసిన తర్వాత ఎవరో 2005 లో తన భార్య రాధిక పండిట్ తో కలిసి నందగోకుల అనే సీరియల్ లో చేసే ఛాన్స్ ఇచ్చారట. అది హిట్ కావడంతో తర్వాత సంవత్సరం రాకీ చిత్రంలో హీరోగా అవకాశం వచ్చిందట. ఆ సినిమాలో యష్ యాక్టింగ్ చూసి వెంటవెంటనే పలు చిత్రాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయట. అలా చేస్తుండగానే కేజీఎఫ్ ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ యష్ ను బాక్సాఫీసు రారాజును చేసింది.
