Jaya Lalitha జీవితంలో భాదలున్నాయా.. నమ్మించి మోసం చేశారా?

- Advertisement -

Jaya Lalitha..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకప్పుడు స్టోరీ డిమాండ్ చేస్తే కాస్త బోల్డ్ గా కూడా కనిపించింది.. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించిన ఈమె ఇప్పుడు సెలెక్టేడ్ సినిమాల్లోనే నటిస్తూ వస్తుంది..తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె తన జీవితజం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది..అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. విషయానికొస్తే..

Jaya Lalitha
Jaya Lalitha

తన పెళ్లి గురించి, పెళ్లి తర్వాత తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ఆమె షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో కమల్ నాకు ఛాన్స్ ఇప్పించారని ఆమె అన్నారు.. ఒకరోజుకు మూడు షూట్స్ లో పాల్గొన్నానని ఆమె పేర్కొన్నారు. నా కుటుంబం స్థిరపడింది అనే సమయంలో పెళ్లి చేసుకున్నానని జయలలిత చెప్పుకొచ్చారు.. నేను అప్పుడు మలయాళ డైరెక్టర్ ను ప్రేమించింది.. నేను ప్రేమలో పడ్డానని ఏడేళ్ల ప్రేమ అని ఆమె కామెంట్లు చేశారు. దొంగకోళ్లు పట్టేవాడిలా ఉన్నాడు అతనితో పెళ్లి ఎందుకు అని చాలామంది చెప్పారని జయలలిత చెప్పుకొచ్చారు..

ఎంతమంది చెప్పిన నేను వినలేదు.. బ్లడ్ తో లెటర్ రాయడం. విషం తాగి చనిపోతానని చెప్పడంతో నేను కరిగిపోయి పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపారు. మా కుటుంబానికి పెళ్లి ఇష్టం లేదని ఆ సమయంలో మా పేరెంట్స్ పవర్ ఆఫ్ అటార్నీ నాతో రాయించుకుని మంచి పని చేశారని ఆమె అన్నారు.. నా భర్త మాత్రం చేసుకున్నారని అర్థమైందని జయలలిత పేర్కొన్నారు. ఆ తర్వాత విడిపోయామని ఆమె అన్నారు. చనిపోతామని ఎవరైనా చెబితే కోపం వస్తుందని జయలలిత తెలిపారు.. ఆమె జీవితం గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here