Leo : కోలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న మూవీ లియో. ఈ సినిమాకు అడుగడునా కష్టాలే ఎదరువుతున్నాయి. తాజాగా మరో మారు లియో మూవీని బ్యాన్ చేయాలంటూ ఓ రాష్ట్రంలోని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. సౌతిండియాలో రజనీ కాంత్ తర్వాత అంతటి ఫేమ్ సంపాదించుకున్న హీరో విజయ్. ఇండియా మొత్తం ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలను తెలుగులో డబ్ చేసి టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు కేరళలోనూ మార్కెట్ ఉంది. కానీ ‘లియో’ మూవీని ఆ రాష్ట్ర ప్రజలు బాయికాట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్విటర్ లో మీడియాలో #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయింది.
సోషల్ మీడియా డిస్కషన్స్ లో భాగంగా ఆ రాష్ట్రంలో మోహన్ లాల్ అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘జిల్లా’సినిమాలో నటించారు. ఇటీవల సోషల్ మీడియాలో విజయ్ నటన మోహన్ లాల్ ముందు తేలిపోయిందని మోహన్ లాల్ ఫ్యాన్స్ అన్నారు. అది తమిళ విజయ్ ఫ్యాన్స్ కి అసలు నచ్చలేదు. దీంతో వాళ్లు ఎదురుదాడి మొదలు పెట్టారు. మోహన్ లాల్ నటన చాలా సినిమాలో పరమ చెత్తగా ఉందంటూ క్లిప్స్, ఫోటోలు షేర్ చేయడం మొదలెట్టారు. దీన్ని విజయ్ అభిమానులు ఓ ఉద్యమంగా చేపట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో మోహన్ లాల్ అభిమానులు కోపంతో ‘కేరళలో మీ హీరో సినిమా ఆడనివ్వమంటూ’ #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ‘లియో’ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది రాబోతోంది.