Anushree : యాక్టింగ్ కోసం రజాకర్ నటి ఎంత చేసిందో తెలిస్తే.. దండం పెడతారు..!

- Advertisement -

` ప్రశంసలు అందుకోవడం తనకి చాలా ఆనందంగా ఉందని తెలిపింది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ర‌జాకార్ సినిమా కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాలో అనుశ్రీ కీలక పాత్ర పోషించింది. ఇందుకుసంబంధించి తాజాగా అనుశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందాన్ని ఇస్తుందని..

Anushree
Anushree

సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారని తెలిపింది. ముఖ్యంగా సినిమా చూస్తున్న ప్రేక్షకుల కళ్ళల్లో దేశభక్తి కనపడిందని థియేటర్స్ లో భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తుండడం చూసినప్పుడు ఇలాంటి సినిమాలో తాను నటించడం ఆనందంగా అనిపించింది అని చెప్పింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణకు, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. ఇకపోతే., జీవితంలో తన కాలేజ్ పూర్తయిన తర్వాత తాను సివిల్స్ కు చదవాలని తన నాన్న అనుకున్నట్లుగా తెలిపింది.

Anushree Photos
Anushree Photos

అయితే తనకి చాలా కాలం నుండి నటిని కావాలనే కోరిక బలంగా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది. ఈవిడ బెంగళూరులోని థియేటర్స్ గ్రూప్ లో కూడా సభ్యురాలుగా ఉంది. అయితే ఆమె నటన కలను నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చానని.. ఇక్కడ థియేటర్స్ వర్క్ షాప్ లో పాల్గొన్నట్లు తెలిపింది. ఈ సినిమాలో పాత్ర కొరకు మొదటిగా దర్శకుడిని కలవగా ఆయన నిజాం భార్యగా పాత్ర కోసం వెతుకుతున్నట్లు తెలిపి. తనని ఆ పాత్రకు సెలెక్ట్ చేశాడని చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here