Anushka Shetty : వేశ్యగా నటించాలంటే చాలా ధైర్యం కావాలి. హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తూనే ఇలాంటి పాత్రలు చేయడం సాహసమే అని చెప్పాలి. గతంలో వేశ్య పాత్రల్లో నటించాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వేశ్య పాత్రల్లో నటిస్తే బాగా పాపులర్ అవుతుంది. ఈ వేశ్య పాత్రల్లో అనుష్క, ఛార్మీ, శ్రియ తదితర హీరోయిన్లు నటించారు. ముఖ్యంగా అనుష్క స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో వేశ్య పాత్రలో కనిపించింది.

క్రిష్ దర్శకత్వం వహించిన “వేదం” చిత్రంలో ఆమె వేశ్యగా నటించింది. ఈ సినిమాలో అనుష్క పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అనుష్క ఇచ్చిన ధైర్యంతో శ్రియ, ఛార్మీ లాంటి హీరోయిన్లు కూడా వేశ్యలుగా నటించారు. అనుష్క మరోసారి వేశ్య పాత్రలో నటించేందుకు రెడీ అవుతోంది. అనుష్క కొత్త సినిమాకు సంబంధించి ఓ ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా ఎంపికైంది.
తాజాగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ చిత్రానికి “ఘటి” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నాడు. వేదం సినిమాలో అనుష్కని వేశ్యగా చూపించిన క్రిష్.. మళ్లీ అలా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో వేదాలను మించిన సన్నివేశాలను చూపించబోతున్నాడు దర్శకుడు. ఓ సమస్యలో కూరుకుపోయిన ఓ మహిళ దాన్నుంచి బయటపడిన కథే ఘటి అని చిత్ర యూనిట్ తెలిపింది.