Anushka Sharma : సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించాలనే కోరిక ప్రతీ హీరోయిన్ కి ఉంటుంది. స్టార్ హీరోయిన్లు సైతం ఆయనతో నటించే అవకాశం వస్తే, లైన్ లో ఎన్ని సినిమా ఆఫర్లు ఉన్నా ముందు మహేష్ బాబు సినిమాకి డేట్స్ ఇచ్చేందుకు ఇష్టపడుతారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం మహేష్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపలేదట.
అంత పెద్ద సూపర్ స్టార్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపని ఆ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఒక ప్రముఖ స్టార్ క్రికెటర్ సతీమణి. ఆమె మరెవరో కాదు అనుష్క శర్మ. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ‘1 నేనొక్కడినే’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది కానీ, క్రిటిక్స్ నుండి మాత్రం ప్రశంసలను అందుకుంది.
ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా అనుష్క శర్మ ని అనుకున్నారట. అప్పటికీ విరాట్ కోహ్లీ తో ఆమెకి పెళ్లి జరగలేదు. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉండేది. అలాంటి సమయం లో ఈమెకి ‘1 నేనొక్కడినే’ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు నేను తెలుగు సినిమాలు చెయ్యను అని ముఖం మీదనే చెప్పేసిందట.
అప్పట్లో మన తెలుగు సినిమాలు అంటే బాలీవుడ్ హీరోలకు కానీ , హీరోయిన్లకు కానీ చాలా చిన్న చూపు ఉండేది. అనుష్క శర్మ కి కూడా అలాంటి అహంకారమే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉండేదని టాక్. ఇప్పుడు వీళ్లకు తెలుగు సినిమా హీరోలు అవకాశం ఇవ్వడమే ఎక్కువ అనే రేంజ్ కి మన ఇండస్ట్రీ ఎదిగింది. ఎందుకంటే మన హీరోలు ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కంటే రెండింతలు ఎక్కువ.