Anupama Parameshwaran : తెలుగు , తమిళం మరియు మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈమెకి అన్నీ భాషల్లోనూ యూత్ లో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అనుపమ అంటే వాళ్ళు గుండె కోసి ఇచ్చేస్తారు. ఆ రేంజ్ అభిమానులు అన్నమాట. అయితే వాళ్ళు అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోని చూసి గుండె బద్దలైపోయే రేంజ్ కామెంట్స్ పెడుతున్నారు.

ఎందుకంటే ఆమె పెళ్లి బట్టలలో, మూడు ముళ్ళు వేసుకొని కనిపించింది. ఇది చూసి ఫ్యాన్స్ మా అనుపమ కి పెళ్ళైపోయిందా, ఇక నా లవర్ గా ఎవరిని ఊహించుకోవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది నిజం పెళ్లి మాత్రం కాదు. ప్రస్తుతం ఆమె తమిళం లో జయం రవితో కలిసి ‘సైరన్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.

రీసెంట్ గా ఆ సినిమాలో జయం రవితో అనుపమ పెళ్లి సన్నివేశం ని చిత్రీకరించారట. షూటింగ్ గ్యాప్ లో ఆమె తన తాళి బొట్టుని చూపిస్తూ ఫన్నీ గా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ క్లారిటీ అనుపమ ఇవ్వడం తో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ‘ఈగల్’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 25 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చాలా బోల్డ్ గా కనిపించబోతుంది . ఇప్పటికే సిద్ధూ జొన్నలగడ్డతో ఆమె కలిసి రొమాన్స్ చేసిన పోస్టర్లు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక రవితేజ తో చేసిన ‘ఈగల్’ చిత్రం వచ్చే నెల 9 వ తారీఖున విడుదల కాబోతుంది.