Anupama Parameshwaran : అనుపమ, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్లో టిల్లు స్క్వేర్ రిలీజ్ అయింది. తాజాగా భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. డీజె టిల్లు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా హిట్ టాక్ తో దూసుకు వెళ్ళిపోతోంది. డీజి టిల్లు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి హిట్ అవ్వడంతో టిల్లు స్క్వేర్ మూవీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంచనాలని అందుకుంది. ఈ మూవీకి ముందు హీరోయిన్ అనుపమ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సిద్దు గురించి సినిమా గురించి మాట్లాడారు. సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

అనుపమ ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి రోజు సెట్ కి వచ్చినప్పుడు సిద్దు కనీసం హాయ్ కూడా చెప్పలేదని, తన పని తాను చూసుకున్నాడని చెప్పారు. సడన్ గా నా దగ్గరికి వచ్చి నన్ను అలానే కాసేపు చూసినా కాటుక ఐబ్రోస్ గురించి సరిగ్గా లేవని సిద్ధూ చెప్పారు నేను షాక్ అయిపోయాను. ఏంటి ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకున్నాను. సిద్ధుని బాగా
హిట్ చేసేసాను. తనతో కూడా నీతో వర్క్ చేయడం నచ్చట్లేదని సింపుల్ గా అది నీ ఇష్టం అని అన్నాడు.
ఆ బిహేవియర్ నాకు నచ్చలేదు షాక్ అయిపోయాను. వెంటనే కాల్ చేసి ఈ మూవీ చేయాలనుకోవట్లేదు అంతా వెరైటీగా ఉన్నారు అని చెప్పాను. కానీ తర్వాత అర్థమైంది సిద్దు ఈ మూవీకి రైటర్ కూడా అని. టిల్లు క్యారెక్టర్ లో బయట కూడా ఉంటున్నాడని వర్క్ తో స్ట్రెస్ లో ఉన్నాడని తెలుసుకున్నాను. దీంతో ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనుపమ పాత్రలో అదరగొట్టేసింది. లిల్లీ పాత్రలో అనుపమ ఒదిగిపోయింది. రొమాన్స్ తో నటనతో అందరిని మెప్పించింది.