Viswambhara Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గురించి చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతుంటారు. అంతలా పాపులారిటీ సంపాదించుకున్నారు చిరంజీవి. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారారు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమా విశ్వంభర. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చిరు సరసన మరోసారి త్రిషని కన్ఫామ్ చేసుకున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో మరో మెగా హీరో కూడా నటించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడంటూ అంటూ ఫిలిం వర్గాలలో వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త విన్నప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తన సినిమాలో మెగా హీరో ఎవరు నటించిన చిరంజీవికి కలిసి రావడం లేదని.. ఆల్రెడీ ఆచార్య సినిమాతో అది ప్రూవ్ అయిందని.. మళ్లీ డైరెక్టర్ వశిష్ట ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని మండిపడుతున్నారు.

అంతేకాదు వరుణ్ తేజ్ కి బదులుగా మెగా ఫ్యామిలీతో సంబంధం లేనటువంటి వేరే ఏ హీరో ఎవరినైనా తీసుకుంటే సినిమా ఇంకా హిట్ అవుతుంది అంటూ డైరెక్టర్ వశిష్టకు సూచిస్తున్నారు. కొందరు మాత్రం దారుణంగా ఇది మరో ఆచార్య సినిమా అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో మరో మెగా హీరో ఉంటే సినిమాకి కచ్చితంగా నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది . దయచేసి నిర్ణయాన్ని మార్చుకోమంటు వశిష్టను సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.