పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్ సినిమా వరుస వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అయితే రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అంటూ .. పలువురు హిందు సంఘాలు ఆదిపురుష్ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అన్నీ కూడా వివాదాలకు కేంద్రంగా మారాయి.. తాజాగా మరో వివాదాం తెరమీదకు వచ్చింది..
ఈ సినిమా నుంచి విడుదలైన ప్రస్తుం వీడియో ,పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదాలు కూడా పెరుగుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాములుగా అయితే వీటికి ఎటువంటి కాపీ రైట్స్ పడవు కానీ ఈ సినిమా అప్డేట్స్ పై కాపీ రైట్స్ పడుతున్నాయని తెలుస్తుంది. . AiPlex అనే సంస్థ నుంచి కాపీ రైట్స్ పడుతున్నాయని, తమ వీడియోని బ్లాక్ చేసేశారని పలువురు యూట్యూబర్స్ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ఇవి చర్షనీయంశంగా మారుతున్నాయి..
ఇండస్ట్రీలో ఎటువంటి సినిమా రిలీజ్ అయినా కూడా మేము సినిమా ను ప్రమోట్ చేస్తున్నాం కానీ ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు అంటూ వాపోతున్నారు.. ఈసినిమా పై కాపీ రైట్స్ పడటం ఏంటి అంటూ ఫెయిర్ అవుతున్నారు. యూట్యూబ్ మాత్రమే కాక, సోషల్ మీడియాలో కూడా ట్రైలర్, అందులోని షాట్స్ వీడియోల రూపంలో పోస్ట్ చేసిన వారికి కూడా కాపీ రైట్ వేస్తున్నారు.. దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో.. ఎలాంటి వివరణ ఇస్తుందో తెలియాల్సి ఉంది.. ఇలాంటి వార్తలు రావడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. సినిమా విడుదల అవుతుందా అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఏమౌతుందో ..ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి ..