Anjali : సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత నటీనటులు ఎలాంటి పాత్రలు చెయ్యడానికి అయినా సిద్ధం అవ్వాలి. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి కూతురు గా నటించిన శ్రీదేవి, పెద్దయ్యాక ఆయన సరసన హీరోయిన్ గా నటించే సందర్భం వచ్చింది. అలాగే ‘దేవత’ చిత్రం లో సీనియర్ ఎన్టీఆర్ కి చెల్లెలు గా నటించిన ‘సావిత్రి’ ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా చెయ్యాల్సి వచ్చింది.

ఇలాంటి సందర్భాలు ఇండస్ట్రీ లో ఎన్నో ఉన్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితి ఇప్పుడు హీరోయిన్ అంజలి విషయం లో చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అచ్చ తెలుగు అమ్మాయి, ఆ సినిమా తర్వాత జర్నీ చిత్రం తో బాగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిత్రం’ తో మరింత క్రేజ్ ని దక్కించుకుంది.

ఇప్పుడు ఈమె రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం లో ఆయనకీ తల్లి పాత్ర పోషిస్తుంది. శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రం లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి.

అయితే పెద్ద రామ్ చరణ్ కి జోడిగా అంజలి నటిస్తుంది. అంటే రామ్ చరణ్ కి తల్లి పాత్ర అన్నమాట. ఇప్పటి వరకు ఆమె రామ్ చరణ్ తో కలిసి ఎలాంటి సినిమా చెయ్యలేదు కాబట్టి, తల్లి పాత్రని చెయ్యడానికి ఓకే చెప్పింది అట. ఇందులో ఆమె క్యారక్టర్ చాలా వైవిధ్యంగా ఉంటుందని టాక్. ఈ సినిమా ఆమె కెరీర్ ని మలుపు తిప్పుతుందని బలంగా నమ్ముతుంది.
