కొంతమంది సినీ తారలు తాము సంపాదించిన డబ్బు ని ఎలా పదింతలు చెయ్యాలి అనే ఆలోచనలో ఉంటారు. సినిమాలు చెయ్యడం మాత్రమే కాకుండా, సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియక వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టి, కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించి , తమ కొడుకులు,మనవళ్లు ఏళ్ళ తరబడి కూర్చొని తిన్నా తరగని ఆస్తులను సంపాదించి పెడుతారు. కానీ మనిషి పైకి పొయ్యేటప్పుడు చిన్న నూలిపోగు కూడా తీసుకొని పోలేదు అనే జీవిత సత్యం తెలిసి కూడా డబ్బు పై అంత వ్యామోహం ఎందుకు పెంచుకుంటారో అసలు అర్థం కాదు.

అయితే కొంతమంది నటీనటులు మాత్రం తాము సంపాదించిన దాంట్లో నలుగురికి ఎంతో కొంత పంచి పెట్టి,సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటారు, మరికొంత మంది అయితే గుళ్లకు, గోపురాలకు తమ ఆస్తులను విరాళంగా ఇస్తుంటారు . అలా తాను సంపాదించి కూడబెట్టిన ఆస్తిని మొత్తం షిర్డీ సాయిబాబా కి సమర్పించిన ప్రముఖ హీరోయిన్ అంజలి దేవి గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాము.

అలనాటి స్టార్ హీరోయిన్స్ లో అశేష ప్రజాభిమానంని సంపాదించుకున్న హీరోయిన్ ఈమె, తెలుగు మరియు తమిళ భాషల్లో అప్పటి స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఈమె ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ ని ప్రేమించి పెళ్లాడింది. సినిమాల ద్వారా ఆమె సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఆస్తి గా చెయ్యడం లో సఫలం అయ్యింది అంజలి దేవి. భర్త మరణించిన తర్వాత అంజలి దేవి పూర్తిగా మారిపోయింది.

ఆయన జ్ఞానపకాల నుండి బయటపడేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. పెద్ద వయస్సులో కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించి పుట్టపరి సాయి బాబా మరియు శిరిడీ సాయి బాబా కి భక్తురాలిగా మారిపోయింది. తన చివరి రోజుల్లో ఆమె తాను సంపాదించిన ఆస్తిని మూడు భాగాలుగా చేసి మొదటి భాగం ని పిల్లలకు, మిగిలిన రెండు భాగాలను శిరిడీ సాయి బాబా మరియు పుట్టపర్తి సాయి బాబా కి దానం చేసింది. ఆ ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయిలు ఉంటుంది.