Animal Movie : ప్రస్తుతం థియేటర్స్ లో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ‘ఎనిమల్’ చిత్రం, ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లను సాదించబోతుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రణబీర్ కపూర్ ని ఊర మాస్ అవతారం లో చూపించి, వైయొలెన్స్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది అని అందరికీ తెలిసేలా చేసాడు ఆ చిత్ర దర్శకుడు సందీప్ వంగ.

మొదటి రెండు రోజుల్లో ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు లో కూడా ఈ చిత్రానికి బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చాయి. వాళ్ళ అంచనా ప్రకారం తెలుగు లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్, 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయిల గ్రాస్ కేవలం తెలుగు వెర్షన్ నుండి వచ్చే అవకాశం ఉంది.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ కూడా అప్పుడే వచ్చేసింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓటీటీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధర కి కొనుగోలు చేసింది. హిందీ తో పాటుగా తెలుగు, తమిళం మరియు మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని పొంగల్ కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.

ఆరోజు అయితే పండగ సెలవలు కూడా కలిసి వస్తుందని, మంచి వ్యూస్ వస్తాయని అంచనా వేస్తున్నారు. మితిమీరిన వయోలెన్స్ మరియు బోల్డ్ కంటెంట్ తో యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. రెండు రోజుల్లో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబట్టబోతుందో చూడాలి.