Animal : యానిమల్ తృప్తి డిమ్రి చాలా తెలివైందిగా.. ఒక్క సినిమాలో ఎక్స్ పోజింగ్ చేసింది.. బంపర్ ఆఫర్లు కెట్టేస్తుంది..

- Advertisement -

Animal : బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరో గా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఆ చిత్రం లో రణ్‍బీర్ కపూర్‌తో రొమాన్స్ చేసిన తృప్తి. తన అందం తో ఎంతగానో ఆకట్టుకుంది.యానిమల్ సినిమా తో ఈ భామ నేషనల్ క్రష్ గా మారింది. దీంతో తృప్తి తర్వాత చేసే సినిమాలపై ఆసక్తి నెలకొంది.

కాగా, తృప్తి డిమ్రి కి తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కినట్టు సమాచారం. బాలీవుడ్‍‍లో ఎంతో పాపులర్ అయిన ఆషికీ ఫ్రాంచైజీలో తదుపరి రానున్న ఆషికీ 3 మూవీలో హీరోయిన్‍గా తృప్తి డిమ్రికి అవకాశం దక్కిందని సమాచారం. ఆషికీ 3 చిత్రం లో కార్తీక్ ఆర్యన్ హీరో గా చేయనున్నారు. ఈ సినిమా లో కార్తీక్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‍గా నటించనున్నారని సమాచారం. యానిమల్ సినిమా బంపర్ హిట్ తర్వాత తృప్తి డిమ్రి ఫుల్ పాపులరిటీ వచ్చింది.కార్తీక్ ఆర్యన్‍తో ఆమె నటిస్తే అద్భుతంగా ఉంటుందని ఆషికీ 3 మేకర్స్ కొంతకాలంగా అనుకుంటున్నారట. అయితే, ఈ విషయంపై కొన్ని రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు హీరోయిన్‍గా తృప్తి డిమ్రిని ఫిక్స్ చేసినట్టు ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఆషికీ 3 చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా మ్యూజికల్ లవ్ స్టోరీగానే రూపొందనుంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన మ్యూజిక్ స్కోర్ క్రియేట్ చేస్తామని ఇటీవల అనురాగ్ బసు తెలిపారు.ఆషికీ 3 సినిమా షూటింగ్ 2024 మొదటి మూడు నెలల్లోనే ప్రారంభం కానుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్ల గురించి మేకర్స్ ప్రకటించనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here