Anil Kapoor : సీనియర్ హీరో అడిగితే నో చెప్తావా.. ఎంత ధైర్యం నీకు అని మహేష్ బాబు ని వారించిన అనిల్ కపూర్!

- Advertisement -

Anil Kapoor : సందీప్ వంగ దర్శకత్వం లో రణబీర్ కపూర్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎనిమల్’ డిసెంబర్ 1 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న రాత్రి మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

Anil Kapoor
Anil Kapoor

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కి అభిమానులు వేలాదిగా తరళి వచ్చారు. సభా ప్రాంగణం మొత్తం ‘జై బాబు’ నినాదాలతో హోరెత్తిపోయింది. అంతే కాకుండా అక్కడికి వచ్చిన జనాలను చూసి ఎనిమల్ యూనిట్ మొత్తం ఆశ్చర్యపోయింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ ఈవెంట్ కి వచ్చిన జనాల గురించే మాట్లాడుకున్నారు.

ఇకపోతే ఈ ఈవెంట్ లో అనిల్ కపూర్ స్టేజి మీదకు ఎక్కి మహేష్ బాబు ని పైకి వచ్చి డ్యాన్స్ వేయాల్సిందిగా కోరుతాడు. మహేష్ బాబు క్రింద నుండి ‘మీకు దండం సార్..అలాంటివి నేను చెయ్యలేను’ అని సైగలు చేస్తూ ఉంటాడు. అనిల్ కపూర్ ప్లీజ్ రమ్మని పిలుస్తాడు.

- Advertisement -
Animal movie

మహేష్ నుండి అదే సమాధానం వస్తూ ఉండడం తో కోపం తెచ్చుకున్న అనిల్ కపూర్ నేను నీ సీనియర్ హీరోని, నువ్వు నాకు ఇలా నో చెప్పడం కరెక్ట్ కాదు అని అనడం తో మహేష్ బాబు రణబీర్ కపూర్ తో కలిసి పైకి వస్తాడు. పోకిరి నుండి ‘దోలె దోలె’ పాట ప్లే చెయ్యగా, దానికి మహేష్ సిగ్నేచర్ స్టెప్ వేసి, అనిల్ కపూర్ ని కౌగలించుకొని వెళ్ళిపోతాడు. ఈ సంఘటన మొత్తం చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here