ఓ పెద్ద హీరో నటించిన సినిమా వస్తుందంటే..నిర్మాతలు సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుకుంటారు. తెలంగాణ లో అయితే ఆలా అడగ్గానే ఓకే చేస్తారు. కానీ ఏపీ విషయంలో అలాకాదు..తమ అనుకూల వారు అయితేనే ఆ సినిమా టికెట్ ధరలు పెంచుకునే ఛాన్స్ ఇస్తారు. లేదంటే ఏదోక సాకు చెప్పి టికెట్ ధరలు పెంచుకునే ఛాన్స్ ఎవ్వరు. ముఖ్యముగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు టికెట్ ధరలు పెంచుకునే ఛాన్స్ కాదు..ఉన్న ధరలు కూడా తగ్గిస్తుంటారు. అందుకే బ్రో విషయంలో ప్రభుత్వం దగ్గరికి పోలేదు నిర్మాతలు.

ఇక ఇప్పుడు అన్నయ్య భోళా శంకర్ సినిమా విషయంలో ఏపీ సర్కార్..మెగాస్టార్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఆ కసి ని టికెట్ ధరల ఫై చూపించినట్లు అర్ధం అవుతుంది. వారం క్రితమే ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు సర్కారును భోళా శంకర్ మూవీ యూనిట్ కోరింది. అందుకు దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే ఆ దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని టికెట్ల పెంపునకు ప్రభుత్వం తిరస్కరించిందని తాజాగా అందుతున్న సమాచారం. మరి దీనిపై ఏపీ సర్కారు తుది నిర్ణయం ఎలా ఉంటుందో అని నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ..మరో రెండు రోజుల్లో అనగా ఆగస్టు 11 న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం మూవీ కి రీమేక్ గా డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించారు. అనిల్ సుంకర నిర్మించగా, తమన్నా , కీర్తి సురేష్ లు హీరోయిన్లు గా నటించారు. మూడు రోజుల క్రితం వరకు ఈ సినిమా విషయంలో అంత బాగానే ఉంది. కానీ మొన్న వాల్తేర్ వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఏపీ ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురి చేసింది. మా ప్రభుత్వం మీదనే విమర్శలు చేస్తావా..చిరంజీవి..చూసుకుంటాం..అన్నట్లు హెచ్చరికలు జారీ చేసారు వైసీపీ నేతలు. ఇప్పుడు అన్నంత పనిచేసినట్లు తెలుస్తుంది.