Anchor Suma గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా కాలం నుండి ఇండస్ట్రీలో పాతుకుపోయింది. సుమ కేరళలో పుట్టింది కానీ తెలుగు అద్భుతంగా మాట్లాడుతుంది. తెలుగులో యాంకరింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. హిలారియస్ పంచులతో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. తెలుగులో దశాబ్దాల నుండి నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది సుమ. ఈటీవీలో వచ్చే ప్రత్యేక కార్యక్రమాల నుండి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు మూవీ ప్రమోషన్లు ఇలా ప్రతి దాంట్లో కూడా సుమ కనపడుతూ ఉంటుంది. సుమ తర్వాత చాలామంది యాంకర్లు వచ్చినా కూడా ఆమెలా స్థిరపడలేకపోయారు.
సుమ మాత్రం అలా మంచి యాంకర్ గా పాతుకు పోయింది స్పాంటేనిటీని అస్సలు కోల్పోదు హ్యూమర్ ని ఏ మాత్రం మిస్ కాదు. సుమని చాలా మంది అందుకే ఇష్టపడతారు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే విపరీతంగా ఉంటుంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా సుమ ఇచ్చింది తన పెద్ద మనసుని చాటుకుంది. సుమ ఒక్కసారిగా రోడ్డు మీద టమాటాలు గుడ్లు పట్టుకుని కనబడింది. బకెట్లో నీళ్లతో కనిపించింది. హొలీ సందర్భంగా చాలామంది టమోటాలు విసురుకుంటారు. తల మీద గుడ్లు పగలగొడుతుంటారు అలానే వాటర్ ని జల్లుకుంటుంటారు. బెంగళూరులో బకెట్ నీళ్ల కోసం అక్కడ ప్రజలు గంటలు తరబడి చూస్తున్నారు. అప్పుడప్పుడు టమాటా, గుడ్లు ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి.
ఫుడ్ గురించి సీరియస్ గా చెప్తే ఎవరికీ అర్థం అవ్వదు అందుకే సుమ తన స్టైల్ లో హ్యూమర్ ని మిక్స్ చేసి చెప్పింది రంగు పూసుకున్న యువతి లాగా అవతారం ఎట్టి ఒక బిల్డింగ్ పైకి ఎక్కి టమాటాలను విసిరింది. గుడ్లని పగలగొట్టే ప్రయత్నం చేసింది. జగ్గులో నీటిని చెల్లింది. మరో అవతారంలో ఒక యువతి లాగ మళ్లీ దర్శనమిచ్చింది బుట్టలో టమోటాలు గుడ్లు బకెట్ నీళ్లతో కనబడింది. పైన యువత విసురినవి అన్నీ కూడా ఈమె పట్టుకొని బ్రేక్ఫాస్ట్ కోసం గుడ్లు టమాటా కూర కోసం బకెట్ నిలు స్నానం కోసం అని సుమ చెప్పి వెళ్ళిపోయింది చివరలో థాంక్స్ చెప్పింది.
View this post on Instagram